ఫోటో స్టోరి: అనుష్కకి భయం లేదబ్బా

Update: 2016-12-04 04:34 GMT
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకు.. ఈ ఏడాది సూపర్బ్ గా ఉందని చెప్పాలి. అచ్చి రావడం కలిసి రావడం లాంటి కాన్సెప్టులపై నమ్మకం ఉంటే కనుక.. 2016ను అనుష్కకు ది బెస్ట్ అనాల్సిందే. ఇటు సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ తో సుల్తాన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. వెంటనే యే దిల్ హై ముష్కిల్ మూవీలో యంగ్ స్టార్ రణబీర్ కపూర్ తోను భారీ హిట్ సొంతం చేసుకుంది.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీతో బంధానికి చిన్న కదలిక తర్వాత మరిం స్ట్రాంగ్ అయిపోయింది. ఇన్నేసి హైట్స్ ఎక్కేయడంతో.. అమ్మడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ పెరిగిపోయాయి. అందుకే అనుష్క-ఫియర్ లెస్ అంటూ స్పెషల్ గా ఓ కవర్ స్టోరీ కూడా వచ్చేసింది. గో ఇండియా మేగజైన్ కోసం కవర్ పేజ్ ఎక్కిన ఈ బ్యూటీ.. నిజంగానే ఏ మాత్రం భయం లేకుండా పోజ్ ఇచ్చేసింది. క్లీవేజ్ అందాలతో పాటు.. పాదాల నుచి మోకాలి అడుగు పై వరకూ కాళ్ల అందాలను కూడా ప్రదర్శించేస్తోంది.

ఇంత సాధించాక ఇంకా భయపడ్డమేంటి అనుకుందేమో.. ఫియర్ లెస్ గా చాలా ఆన్సర్స్ ఇచ్చిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం అయితే షారూక్ ఖాన్ తో 'ది రింగ్ 'తో పాటు తనే సొంతగా నిర్మించి నటిస్తున్న 'ఫిలౌరి'  కూడా చేస్తోంది అనుష్క శర్మ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News