'రబ్ నే బనాదీ జోడి' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ అనుష్క శర్మ. చూపుల్లో చురుకుతనం.. నవ్వులో కొంటెతనం...మాటల్లో అమాయకత్వం...అన్నీ కలిపితేనే అనుష్క శర్మ. బాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎప్పటినుండో ప్రేమాయణం సాగిస్తున్న విరాట్ - అనుష్క శర్మలు గతేడాది వైభవంగా జరిగిన వివాహం ద్వారా 'విరుష్క'లుగా మారిన విషయం తెలిసిందే. సాధారణంగా పెళ్ళయిన తరువాత హీరోయిన్లు కాస్త బ్రేక్ తీసుకుంటారు. కానీ అనుష్క మాత్రం ఇంకా బిజీ అయ్యిందనే చెప్పాలి. ఓ వైపు సినీ నిర్మాణం.. మరోవైపు సినిమా.. భర్త విరాట్ పనులు.. క్లాత్ బిజినెస్ ఇలా బిజీబిజీగా మారిపోయింది. కానీ తర్వాత రోజుల్లో అనుష్క శర్మ కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాలను తగ్గించుకుంది. 2018లో పారి - సంజు - సుయ్ దాగా - జీరో చిత్రాల్లో నటించింది. గతేడాది ఒక్క సినిమాలో కూడా కనిపించని అనుష్క శర్మ అంగ్రేజీ మీడియంలో కనిపించింది. ఆమె తల్లి కావడానికే విరామం తీసుకున్నారని కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం నేను సినిమాలు చేయడం లేదంటే దానికి కారణం నాకు నచ్చిన కథ రాకపోవడమేనని.. నాకు నచ్చిన కథ దొరికితే నేను నటించడమే ఒక్కటే కాదు నిర్మిస్తాను కూడా. ఇక త్వరలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నానని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.
అయితే ఆమె బిజినెస్ మీద ఫోకస్ చేయడం వల్లనే సినిమాలు తగ్గిస్తోందని కూడా బీ టౌన్ లో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమపై కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసిందని సమాచారం. అయితే ఈ బ్యూటీ ఏ స్టార్ హీరో సరసన నటిస్తుందో అని అంతా అనుకుంటే పొరపాటే. ఈ బ్యూటీ తెలుగులో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. అయితే ముందుగా ఎవరైనా ఇక్కడ బడా నిర్మాతతో పార్టన్ షిప్ లో సినిమాలు స్టార్ట్ చేసి.. ఆ తరువాత సొంతగా సినిమాలు చేద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తన పొడక్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూకి తగ్గట్లుగానే ఇక్కడ కూడా థిల్లర్స్ ట్రై చేద్దామని అనుష్క ఆలోచన అని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అనుష్క శర్మ ఎప్పుడో మన ఇండస్ట్రీలో అడుగుపెట్టాల్సింది. గోపీచంద్ హీరోగా నటించిన 'శౌర్యం' సినిమాలో అతనికి చెల్లెలిగా చేసిన పూనమ్ కౌర్ రోల్ అనుష్క శర్మ చేయాల్సింది. కానీ అదే సమయంలో కింగ్ ఖాన్ షారుక్ పక్కన ఛాన్స్ రావడంతో ఈ సినిమా వదులుకుంది. సో మొత్తం మీద అనుష్క శర్మ టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాకుండా తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా అనుష్క శర్మ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయట. అలానే తన నిర్మాణ సంస్థ పై ఓ పచార చిత్రంలో భర్త కోహ్లీని వాడినట్లు సమాచారం. ఏదేమైనా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క బిజినెస్ వుమెన్ గా కూడా నిరూపించుకోడానికి ట్రై చేస్తోందని చెప్పవచ్చు.