స‌ఖి నుంచి క‌ళ్లు తిప్పుకోవ‌డం కష్ట‌మే

Update: 2022-04-02 11:30 GMT
పెళ్ల‌యి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది అనుష్క శ‌ర్మ‌. ఆ త‌ర్వాత వ‌రుస‌గా విరాట్ తో ఫోటోషూట్ల‌లో పాల్గొంది. తాజ‌గా ఈ జంట ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలు వైర‌ల్ గా మారాయి. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్ షూటింగులో పాల్గొన్నారు. ప్ర‌క‌ట‌న‌లో ఖరీదైన దుస్తులలో పోష్ లుక్ లో కనిపించారు. విరాట్ కోహ్లీ సూట్ -టైతో ఫార్మల్స్ ఎంచుకున్నాడు. అతను తన స్టైలిష్ ఆహార్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. గడ్డంలో కూడా తన బెస్ట్ గా కనిపించాడు. అనుష్క మెరిసే గౌనులో మిరుమిట్ల‌తో క‌నిపించింది.  తన లేడీ లవ్ అనుష్కపై నుంచి క్రికెటర్ కోహ్లీ కళ్లు తిప్పుకోలేకపోయాడంటే అతిశ‌యోక్తి కాదు.

వీరిద్దరూ సోఫాపై పోజులిచ్చిన ఫోటోలను అనుష్‌క‌ పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు వారి అందానికి విస్మయానికి గురయ్యారు. అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో వ్యాఖ్యానిస్తూ.. ``మేము బాగా శుభ్రం చేస్తాము`` అని రాసింది. ఈ ఫోటోలపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. విరాట్ టూ హాట్ అని గాళ్స్ కామెంట్ చేశాడు. తాజాగా ఈ జంట‌ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ హృదయాలను గెలుచుకుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..అనుష్క త‌దుప‌రి న‌టిగా బిజీ కానుంది.  క్లీన్ స్లేట్ ప్రొడక్షన్స్ నుండి వైదొలిగి వేరొక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించి న‌ట‌న‌లోకి వ‌చ్చేసింది. ఆమె ప్రస్తుతం `చక్ దే ఎక్స్‌ప్రెస్` షూటింగ్ లో ఉంది. ఇది జులన్ గోస్వామి ప్రయాణం నుండి ప్రేరణ పొందిన క‌థ‌తో రూపందుతోంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మ‌రో వైపు కోహ్లీ ఆట‌తోనే నిరంత‌రం బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News