ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ.. అనుష్కశర్మల పెళ్లి జరిగిపోవటం. తెలిసిందే. గడిచిన కొద్దిరోజులుగా మీడియా అంతా విరుష్క్ పెళ్లి వార్తలతో నిండిపోయింది. వీరిద్దరికి ఎంతో మంది అభినందనలు చెప్పారు. కొందరైతే సలహాలు.. సూచనలు చేశారు. అయితే.. వీరిందరికి భిన్నమైన సూచన చేసి సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచారు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ. ఎవరూ ఊహించని రీతిలో ఆయనిచ్చిన సలహా అనుష్కనే కాదు.. చాలామందిని ఆకట్టుకుంది.
శ్రీలంక జట్టుతో రెండు రోజుల క్రితం జరిగిన వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించటమే కాదు.. ఇప్పటికి మూడుసార్లు అలాంటి ఫీట్ సాధించిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అనుష్క..కోహ్లీల పెళ్లి సందర్భంగా భిన్నమైన సూచనలు చేశారు.
పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటిపేరు మార్చుకోవాల్సిన పని లేదని అనుష్కకు సూచన చేశారు. రోహిత్ సలహాకు అనుష్క థ్యాంక్స్ అంటూ స్పందించారు. ఇక.. కోహ్లీ విషయానికి వస్తే కాస్త సరదా వ్యాఖ్య చేశారు. కోహ్లీ.. భార్యతో ఎలా మెలగాలో తెలిపే పుస్తకాన్ని నీకిస్తా అంటూ ట్వీట్ చేశారు. గడిచిన కొద్దిరోజులుగా పెళ్లి పనులతో హడావుడిగా ఉన్న అనుష్క.. ట్విట్టర్ లో గురువారం రియాక్ట్ అయ్యారు. తనకు ట్వీట్స్ చేసిన పలువురికి ఆమె సమాధానాలు ఇచ్చారు.
ఈ ముచ్చట ఇలా ఉంటే.. తమ పెళ్లి వేడుకను పురస్కరించుకొని ఈ నెల 21.. 26 తేదీల్లో బంధువులకు.. స్నేహితులకు వేర్వేరుగా.. వేర్వేరు వేదికల మీద విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ విందు ఆహ్వానాలను భిన్నమైన రీతిలో తయారు చేసి అందరి మదిని దోచుకుంటున్నారు. ఆహ్వానపత్రికలో పర్యావరణంపై తమకున్న ప్రేమను ప్రదర్శించారు. విందుకు ఆహ్వానించిన వారందరికి ఇన్విటేషన్ తో పాటు.. చిన్న మొక్కను ఇచ్చి సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లు వ్యవహరించారు.