ఫోటో టాక్: అది ఒళ్ళా.. విల్లా? అనుష్కా

Update: 2023-01-22 02:30 GMT
రబ్ నే బనాదీ జోడీ అనే సినిమాతో అనుష్క శర్మ బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో షారుఖ్ కు జోడిగా నటించింది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. దీంతో ఆమెకు వరుస సినిమాల ఛాన్స్ లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క శర్మ... స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ... హవా చూపిస్తోంది.

 ఈ తరుణంలోనే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది. కొంతకాలం రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జోడి... కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. విరాట్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ సినిమాల్లో నటించింది.

 అయితే 2021 లో ఈ జోడీ ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరు పాపకు వామికా అని పేరు పెట్టారు. దీంతో ఆమె రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. చాలా కాలం పాటు వరస సినిమాలు చేసిన అనుష్క శర్మ... కొంత కాలం ఖాళీగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

 ఈ క్రమంలో తన వ్యక్తిగత సినీ కెరియర్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ... ఫ్యాన్స్ ను పెంచుకునే పనిలో పడింది. తాజాగా తన శరీరాన్ని విల్లులా వంచి ఉన్న ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దానికి పర్స్పెక్టివ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. చూసిన ఫ్యాన్స్.. కామెంట్ బాక్స్ లో లవ్ సింబల్స్ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఈ భామ త్వరలో సినిమాల్లో వచ్చేందుకు సిద్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News