స్పోర్ట్స్ బ్రాండ్ కి ఫుల్లు కోటింగ్ ఇచ్చిన అనుష్

Update: 2022-12-19 15:00 GMT
ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ అయిపోయిన ఈ ప్ర‌పంచంలో పబ్లిసిటీ ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు కొంద‌రు ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల‌ను ఎంచుకుంటున్నారు. ఎస్కేపిజం అనేది దీనిలో ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌. ఎదుటి వారి హ‌క్కుల‌ను ఉల్లంఘించి వారి ప‌రప‌తిని త‌మ ఉత్ప‌త్తి ప్ర‌చారానికి వాడుకునేందుకు సిగ్గు లేకుండా ప్ర‌య‌త్నించే ఒక సెక్ష‌న్ వ్యాపారులు కూడా ఉంటారు!

ఇప్పుడు అలాంటి ఒక బిజినెస్ మేన్ .. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ప‌ర‌ప‌తిని దుర్వినియోగం చేశాడు. త‌న పేరు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం క‌లిగిస్తూ త‌న అనుమ‌తి లేకుండా బ్రాండ్ ప‌బ్లిసిటీకి స‌ద‌రు క‌థానాయిక‌ ఫోటోల‌ను ఉప‌యోగించుకున్నాడు. అయితే ఇదంతా త‌న కంట ప‌డిన త‌ర్వాత అనుష్క ఊరుకుంటుందా? అత‌గాడికి త‌న‌దైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చేసింది. నా అనుమ‌తి లేకుండా ఫోటోల‌ను వాడుకుంటే అది శిక్షార్హం! అని అత‌డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వెంట‌నే ప్ర‌చార బ్యాన‌ర్ల నుంచి వాటిని తొల‌గించాల‌ని ఫైరైంది.

అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ఆకర్షణీయమైన ప్రభావవంతమైన బాలీవుడ్ సెలబ్రిటీలలో ఎన‌లేని గుర్తింపు ఉంది. ఇన్ స్టా వేదిక‌గా 61.6 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉంది. ఇటీవల తన ఫోటోలను త‌మ‌ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉపయోగించిన స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ బాస్ ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు అనుష్క వెన‌కాడ‌లేదు.

త‌న అనుమతి తీసుకోకుండా తన ఫోటోలను ప్ర‌చారానికి ఉపయోగించినందుకు స‌ద‌రు స్పోర్ట్స్ బ్రాండ్ ను హెచ్చ‌రించింది. కొన్ని నెలల క్రితం.. అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ త్రోబ్యాక్ ఫోటోని స‌ద‌రు బ్రాండ్ ఉప‌యోగించుకుంది. ఇందులో బ్లాక్ లెగ్గింగ్స్ తో జత చేసిన పసుపు రంగు స్పోర్ట్స్ బ్రాలో టోన్డ్ అబ్స్ ను ప్రదర్శిస్తూ కనిపించింది. ఈ పోటోలో కిటికీ పక్కన పోజులిచ్చి కనిపించింది. స్పోర్ట్స్ బ్రాండ్ ఇటీవల త‌మ అధికారిక‌ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో అనుష్క ఫోటోను ఉపయోగించుకుంది. అందులో స‌ద‌రు కంపెనీ తమ ముగింపు-సీజన్ సేల్ గురించి విస్త్ర‌తంగా ప్రచారం చేసుకుంది. అనుష్క స‌ద‌రు బ్రాండ్ కి చెందిన‌ దుస్తులను ధరించి ఫోజులిచ్చిన‌ట్టుగా మార్ఫింగ్ కూడా చేసారు. వీటి నుంచి కొన్ని ఫోటోల‌ను అనుష్క పోస్ట్ చేసారు.

తన అనుమతి లేకుండా ఫోటోల‌ను వాడుకున్నందుకు అనుష్క వారిపై విరుచుకుపడింది. నేను మీ బ్రాండ్ అంబాసిడర్ కాను.. అలాంటప్పుడు నా అనుమతి లేకుండా ఫోటోలను ప్రచారానికి ఉపయోగించడం ఎలా కుదురుతుంది? అని ప్ర‌శ్నించింది. వెంట‌నే ఆ ఫోటోల‌ను తొలగించాల‌ని కూడా హెచ్చ‌రించింది.  

అనుష్క తన ఇన్ స్టా వార్నింగ్ లో సూటిగా ఉన్న విష‌యాన్ని ప్ర‌స్థావించింది. ``నేను మీ అంబాసిడర్ ని కాను కాబట్టి నా ఫోటోలను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకునే ముందు అనుమతి తీసుకోవాలని మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. దయ చేసి వాటిని తొల‌గించండి`` అని రాసింది.

అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ కెరీర్ సంగ‌తులు ప‌రిశీలిస్తే ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు బిజీ బిజీ. అనుష్క చివరిసారిగా 2018 చిత్రం `జీరో`లో కనిపించింది. షారుఖ్ ఖాన్- కత్రినా కైఫ్ ల‌తో కలిసి ఈ చిత్రంలో నటించారు. ఆ త‌ర్వాత‌ నిర్మాతగా అనేక హిట్ సినిమాలకు అనుష్క స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు అనుష్క న‌టిగా తన చిత్రం `చక్దా ఎక్స్ ప్రెస్‌`తో తిరిగి బ‌రిలో దిగేందుకు సిద్ధంగా ఉంది. ఇది భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ బయోపిక్ కేట‌గిరీలో తెర‌కెక్కుతోంది. దీనిని నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ చేస్తారు. ఇటీవల విడుదలైన ఖలా చిత్రంలో కూడా కనిపించింది, ఇందులో అనుష్క‌ అతిధి పాత్రలో కనిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News