ప్లాస్టిక్ సర్జరీ మాటెత్తగానే మంటెత్తిపోయింది

Update: 2016-05-20 11:07 GMT
గత ఏడాది ఆరంభంలో అనుష్క శర్మను చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. ఆమె పెదవులు ఒక్కసారిగా ఉబ్బిపోయి ఏదో తేడా కొట్టేసినట్లుగా కనిపించాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తడబడుతూ సమాధానం చెప్పింది అనుష్క. ఐతే తన పెదవుల అందం పెంచుకోవడానికి అనుష్క ఏదో సర్జరీ ట్రై చేసిందని.. అది వికటించి ఆమె లిప్స్ అలా తయారయ్యాయని మాట్లాడుకున్నారు జనాలు. దీనిపై అప్పట్లో అనుష్క చాలా సీరియస్ అయింది. ఐతే కొన్నాళ్ల తర్వాత అనుష్క పెదవుల్లో మార్పు కనిపించింది. ఆమె మునుపటి కన్నా చాలా అందంగా తయారైంది. మొత్తానికి ప్లాస్టిక్ సర్జరీ వల్లే అనుష్క అందం పెరిగిందని జనాలకు ఓ నమ్మకం వచ్చేసింది.

ఐతే తాజాగా ఓ విలేకరి అనుష్క పెదవుల గురించి.. ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రస్తావించాడు. దీనిపై ఆమె మండిపడింది. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని.. ఇలాంటి వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని ఆమె వార్నింగ్ ఇచ్చింది. ‘‘అందరిలాగే నేను మనిషినే. నాలోనూ కొన్ని లోపాలుంటాయి. అలాగని ఎప్పుడూ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నా పెదవులపై కత్తి పెట్టించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నా దగ్గర ఈ విషయం ఎత్తకండి’’ అని అనుష్క గట్టిగా చెప్పింది. మొదట్లో తనకు మేకప్ గురించి అంతగా అవగాహన లేదని.. ఆ తర్వాత తాను ఈ విషయంలో ఎంతో మెరుగయ్యానని అనుష్క అంది. సల్మాన్ సరసన చేయబోతున్న ‘సుల్తాన్’ సినిమాలో సరికొత్త అనుష్కను చూడబోతున్నారని ఆమె చెప్పింది.
Tags:    

Similar News