చూపు తిప్పుకోనీయనిది అందం .. మళ్లీ మళ్లీ తలతిప్పి చూడమంటూ మనసు తొందర చేసేది అందం. కనురెప్పలు వాలిస్తే చాలు రెప్పల మధ్య నాజూకుగా నలిగిపోయేది అందం. ఉత్సాహంగా ఊహాలోకాన్ని పరిచయం చేసేది అందం. అలాంటి అందం పేరు .. అందం అద్దుకున్న సుమగంధం పేరు అనుష్క. అప్సరసలు ఎలా ఉంటారో తెలియనివారికీ .. అజంతా శిల్పాలను చూడనివారికి అనుష్కను చూపించవచ్చు. తెలుగు తెరపై అందమైన చందమామలా .. సౌందర్యమనే సరస్సులో విరిసిన కలువభామలా అనుష్క కనిపిస్తూ ఉంటుంది.
మంగుళూరులో పుట్టిపెరిగిన అనుష్క .. కాలేజ్ చదువు పూర్తయిన తరువాత 'యోగా' పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఇక యోగా టీచర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నారు. అయితే అప్పటికే ఆమెకి సినిమాల పట్ల ఆసక్తి ఉండేది .. కానీ మొహమాటం కారణంగా ఆమె ఎప్పుడూ ఎవరినీ కలవలేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి 'సూపర్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు' సినిమాతో ఆమె తొలి విజయాన్ని అందుకున్నారు.
ఆ తరువాత తెలుగులో 'లక్ష్యం' .. 'మిర్చి' వంటి సూపర్ హిట్లతో దూసుకుపోయిన అనుష్క, 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు. ఈ సినిమాలో దేవసేనగా ఆమె ప్రతి మనసును అల్లుకుపోయారు .. ప్రతి హృదయాన్ని హత్తుకుపోయారు. తెరపై దేవసేనను చూస్తున్నామా? దేవకన్యను చూస్తున్నామా? అని ప్రేక్షకులు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అంతలా ఆమె తన అందచందాలతో .. అభినయంతో కట్టిపడేశారు. ప్రేక్షకుల గుండెల్లో దేవసేన పాత్రను సజీవంగా ఉండేలా చేశారు.
అనుష్క అంటే వెన్నెల్లో చందమామలాంటి అమ్మాయి .. సున్నితమైన .. సుకుమారమైన పాత్రలను మాత్రమే చేయగలదని అంతా అనుకున్నారు. అలాంటివాళ్లంతా 'అరుంధతి' సినిమా చూసి షాక్ అయ్యారు. అరుంధతి - జేజెమ్మ అనే రెండు విభిన్నమైన పాత్రల మధ్య ఆమె చూపించిన వేరియేషన్స్ చూసి విస్మయానికి లోనయ్యారు. ఈ సినిమాను ఆమె విశ్వరూప విన్యాసానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. ఇక 'రుద్రమదేవి' కూడా అంతే .. అసమానమైన ఆమె అభినయానికి అద్దం పడుతుంది. 'భాగమతి' తరహా పాత్రలను సైతం తాను మాత్రమే చేయగలనని ఆమె నిరూపించారు.
మన కథానాయికలలో చాలామంది అందంగానే ఉంటారు .. ఆ మాట కొస్తే అందంగా ఉంటేనే కదా కథానాయికలు అవుతారు. కాకపోతే అలాంటివారిలో అనుష్క స్థానం ప్రత్యేకం. ఎందుకంటే జానపద పౌరాణిక పాత్రలకి సైతం సరిగ్గా సరిపోయే చక్కని కనుముక్కుతీరు .. అలాంటిపాత్రలకు కావలసిన రూపలావణ్య విశేషాలు ఒక్క అనుష్కలోనే పుష్కలంగా కనిపిస్తాయి. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అనుష్క, కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించారు. ఆమె మళ్లీ వరుస సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రోజున అనుష్క బర్త్ డే .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.