టాప్ స్టోరి: పూల చీర క‌రోనాలు

Update: 2020-04-01 02:30 GMT
ఫ్యాష‌న్ రూపు రేఖ‌లు మార్చుకుంటోంది. ఇంత‌కుముందులా యూత్ బిగ‌దీసుకుని కూచోవ‌డం లేదు. ఓపెన‌ప్ అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే కొత్త ట్రెండ్ ని ఫాలో చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. సెల‌బ్రిటీలు ఏ కొత్త ట్రెండ్ ని అనుస‌రించినా దానిని ఇట్టే ఒడిసిప‌ట్టేస్తున్నారు. ర‌క‌ర‌క‌లా పూలతో ప్రింటెడ్ దుస్తులు .. చీరలు పరిశ్రమలో అన్ని వేళ‌లా ట్రెండ్ సెట్ట‌ర్స్ అనే చెప్పాలి. ఇటీవ‌ల ఇదో కొత్త ధోరణి గా ఫ్యాష‌న్ ప్రియుల్లో పాపుల‌ర‌వుతోంది.  చాలా మంది ప్రముఖులు ఈ త‌ర‌హా డిజైన్స్ ని ధరించడం కనిపిస్తుంది. ఈ త‌ర‌హా లుక్ లో సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా ఎవ‌రైనా అందంగా కనిపించ‌డంతో అదో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

అనుష్క శెట్టి టాలీవుడ్ లో క్లాసీ లుక్ ఉన్న నాయిక‌. ర‌క‌ర‌కాల చీర‌లు.. డిజైన‌ర్ దుస్తులు ధరించి ఆ దుస్తుల‌కే వ‌న్నె తెచ్చిన న‌టిగా ఫేమ‌స్ అయ్యింది.  అనుష్క తెల్లని చీరను దానిపై పూల ఆకృతులతో ధరించిన ఫోటో యువ‌త‌రంలోకి దూసుకెళ్లింది. స్వీటీ ఆ చీరలో దేవ‌తా సుంద‌రి అంత‌ అందంగా కనిపిస్తోంది. వైట్ కి ఎరుపు జాకెట్టు కాంబినేష‌న్ త‌న ఫ్యాష‌న్ ని ఇనుమ‌డింప‌జేసింది.

సౌత్ సూప‌ర్ స్టార్ నయనతార టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా ఫ్యాష‌నిస్టాగా రాజ్య‌మేలుతోంది. ఇటీవ‌ల సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తూనే గ్లామ‌ర్ ఎలివేష‌న్ లోనూ త‌నదైన‌ స్టైల్ వేరు అని ప్రూవ్ చేస్తోంది. ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమ లో ఇంత‌గా పాపుల‌ర్ అవ్వ‌డానికి కార‌ణం అందాన్ని మెయింటెయిన్ చేయ‌డ‌మేకాదు.. నిరంత‌రం త‌న స్థాయిని పెంచే ఫ్యాష‌న్స్ ని అనుక‌రించ‌డం కూడా ఓ కార‌ణం. ఇక న‌య‌న్ చీరల ఎంపిక ఎక్స్ క్లూజివ్. తాను ఏది ఎంచుకున్నా.. దానిలో అందంగా కనిపిస్తుంది. ఆమె పూల చీరలో మ‌రింత‌ అందంగా కనిపిస్తుంది. తాజాగా ఓ ఈవెంట్లో ఫ్లోర‌ల్ శారీలో అద‌ర‌గొట్టింది.

కీర్తి సురేష్ టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్. ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌కు అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ఉంది. ఆమె పసుపు పూల చీర ధరించి లేటెస్ట్ గా ఓ వేడుక‌లో కనిపించింది. ఆ చీరలో నక్షత్రంలా మెరుస్తూ త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది. చీర‌లో ముస్తాబైన తీరు ఆక‌ట్టుకుంది.

సమంతా అక్కినేని సౌత్ ట్యాలెంటెడ్ నటిగానే కాదు ఫ్యాష‌న్ అండ్ స్టైల్స్ లోనూ యూనిక్ నెస్ తో ఆక‌ట్టుకుంటోంది. సామ్ విల‌క్ష‌ణ‌మైన‌.. అద్భుతమైన లుక్స్ .. అద్భుతమైన నటన నైపుణ్యాలపై యువ‌త‌రంలో నిరంత‌రం చ‌ర్చ సాగుతుంటుంది. తాజాగా ఎరుపు పూల చీర ధరించి కనిపించిన సామ్ పై యువ‌త‌రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ చీరలో జాబిల‌మ్మ‌లా ఎంతో అందంగా అద్భుతంగా ఉందంటూ యూత్ పొగిడేశారు. తాజా ఫోటోలో పూల చీరలో ఎవరు ది బెస్ట్? అన్న‌ది మీరే ఎంపిక చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News