అనుష్క షాకింగ్ నిర్ణయం... ఫ్యాన్స్‌ విమర్శలు

Update: 2022-05-19 11:30 GMT
టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసింది. ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందని అంతా నమ్మకంగా ఉండే వారు. కోహ్లీ ఆమెను హీరోయిన్ గా ప్రోత్సహిస్తాడని భావించారు. కాని ఆమె మాత్రం సినిమాల నుండి మెల్ల మెల్లగా తప్పుకుంటున్నట్లుగా పేర్కొంది.

ఇప్పటికే నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి అనుష్క గతంలో ఒక నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించింది. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతగా కూడా అనుష్కకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అలాంటి నిర్మాణంను అనుష్క ఇటీవలే వీడుతున్నట్లుగా ప్రకటించిన విషయం అందరికి తెల్సిందే.

తాజాగా మరో షాకింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చింది. వైవాహిక జీవితాన్ని.. కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా పోటీ ప్రపంచం నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ అనేది పోటీ ప్రపంచం.. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడంలో విఫలం అవుతున్నాం. అందుకే పోటీ ప్రపంచం నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది.

కుటుంబంకు ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశ్యంతో నిర్మాణ సంస్థ నుండి వైదొలిగా... అంతే కాకుండా హీరోయిన్ గా కూడా ఇంతకు ముందు చేసినట్లుగా సినిమాలు బిజీ బిజీగా చేయడం లేదు. నా పరిమితి లో తక్కువ సమయం కేటాయిస్తూ సినిమాల్లో నటిస్తాను తప్ప గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయాలనే ఆసక్తి లేదు అన్నట్లుగా అనుష్క పేర్కొంది.

అనుష్క నిర్ణయం పై సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి అయిన హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీని వదిలి వేయడం లేదు. చాలా మంది పెళ్లి అయిన తర్వాత మరింత పెద్ద స్టార్స్ అయిన వారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన ఫ్యామిలీ లైఫ్‌ కు దూరం అయినట్లు కాదు.. సరైన ప్లానింగ్‌ ఉంటే రెండు చోట్ల కూడా ఇబ్బంది లేకుండా అందరిని సంతృప్తి పరచవచ్చు.

అనుష్క ఈ నిర్ణయం వెనుక మరెవ్వరైనా ఉన్నారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయడం పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా అంటే ఔను అనే సమాధానం కూడా కొందరు ఇస్తున్నారు. ఆమె మాత్రం తన భర్త.. పాప కుటుంబంకు సమయం కేటాయించాలని సినిమాలు తగ్గించాను అంటోంది.
Tags:    

Similar News