డార్లింగ్ బ్యూటి అనుష్క కథానాయికగా వస్తున్న సైజ్ జీరో సినిమా ఈ నెల 27న రిలీజవుతోంది. నిర్మాత పీవీపీ ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకే అతి బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా కొట్టని ఈయన కంపెనీకి ఈ సినిమా విజయం కీలకం. క్యూరియాసిటీ పెంచేందుకు చాలానే కసరత్తు చేశారు. అనుష్క కథానాయికగా తెరకెక్కించిన వర్ణ ఫ్లాపవ్వడంతో పీవీపీ కి ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్.
లావుపాటి అమ్మాయి సన్నజాజి తీగలా మారాలనుకుంటే ఎలాంటి పాట్లు పడాల్సొచ్చింది అన్న వైవిధ్యమైన లైన్ తో ప్రయోగాత్మకంగా సినిమాని తెరకెక్కించాడు దర్శకుడ ప్రకాష్ కోవెలమూడి. ఇప్పటికే టీజర్ లకు - పాటలకు చక్కని స్పందన వచ్చింది. ఇకపోతే ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈ చిత్రాన్ని దాదాపు 1500 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే టిక్కెట్టు కొంటే కేజీ బంగారం కానుక అంటూ ప్రకటించారు. ఈ స్కీములన్నీ ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో తెలియదు కాని.. అనుష్క కెరియర్ లో ఇన్నేసి ధియేటర్స్ లో రిలీజ్ సినిమాగా సైజ్ జీరో మాత్రం ఒక రికార్డే.
కంటెంట్ ఏ మాత్రం ఆసక్తికరంగా ఉన్నా.. సినిమా హిట్టవుతుంది. బీభత్సమైన కలెక్షన్లు వస్తాయి. కంటెంట్ లో కిక్ లేకపోతే మాత్రం అఖిల్ సినిమా తరహాలో ఓపెనింగ్ డే రికార్డులు వస్తాయి.. తరువాత గ్రాఫ్ పడుతుంది. మరి అనుష్క సైజు ఏం చేస్తుందో లెటజ్ సీ!!