బాలీవుడ్ బయోపిక్ ల సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ క్రీడా నేపథ్యం తో ముడిపడిన ప్రముఖుల బయోపిక్ లకు సక్సెస్ రేటు గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో బయోపిక్ కి రంగం సిద్దమైంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ 'జులన్ నిషిత్ గోస్వామి'పై సినిమా తెరకెక్కనుంది. ఇందులో అనుష్క శర్మ నిషిత్ గోస్వామి పాత్రలో నటిస్తుంది. `చక్ ద ఎక్స్ ప్రెస్` టైటిల్ తో అనుష్క ప్రొడక్షన్ హౌజ్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు 'పరి' డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అనుష్క శర్మ మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ కంబ్యాక్ అవుతోంది.
పెళ్లైన తర్వాత అనుష్క ధాంపత్య జీవితానికి ఎక్కువ సమయం కేటాయించింది. ఈ క్రమంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అలా అనుష్క మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా మళ్లీ బయోపిక్ తో మేకప్ వేసుకుంటోంది. సినిమాకి సంబంధించిన ఓ వీడియోను అనుష్క, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి అభిషేక్ బెనర్జీ కథ..స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నారు.
జులన్ గోస్వామి బయోపిక్ ని ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. జులన్ గోస్వామి స్వస్థలం పశ్చిమబెంగాల్ రాష్ర్టంలో లోని నాడియా జిల్లాలో చక్ దాహ. అక్కడ నుంచి లార్స్డ్ వరకూ ఆమె ప్రయాణం ఎలా సాగిందన్నది ఎంతో ఆసక్తికరంగా మలస్తున్నారు. మహిళల ప్రపంచకప్ పైనల్ లో ఇంగ్లాండ్ పై టీమ్ ఇండియా ఓటమిని హైలైట్ చేస్తున్నారు. క్రీడల్లో పురుషులే కాదు..మహిళలు రాణించగలరని చాటి చెప్పిన మహిళగా జులన్ కి మంచి పేరుంది. ఎంతోమంది మహిళా క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపారు . ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. వాటిని సాధించడం కోసం ఆమె ఎంతగా శ్రమించారు? అన్నది సినిమాలో ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్లు సమాచారం.

Time to scream HOWZZAT cause we can’t contain the excitement to see @AnushkaSharma hitting the wickets like #JhulanGoswami in Chakda ‘Xpress, filming soon