విరాట్-అనుష్క బ్రేకప్.. ఫిక్సయిపోవచ్చా?

Update: 2016-02-02 11:30 GMT
లండన్ వీధుల్లో చూసినా వాళ్లే.. ఆస్ట్రేలియా రెస్టారెంట్లలో చూసినా వాళ్లే.. ఇక ఇండియాలో అయితే స్టేడియాలేంటి.. ఎయిర్ పోర్టులేంటి.. ఎక్కడ చూసినా ఆ జంటే. అలాంటి జంట విడిపోతోందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. నిజంగా విడిపోతున్నారా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ.. ఆ దిశగా సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లి అనుష్కను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవడం మానేసిన సంగతి తెలిసిందే.

దీంతో అనుష్కకు అతను టాటా చెప్పేస్తున్నాడేమో అన్న రూమర్లు మొదలయ్యాయి. ఐతే రెండు రోజుల గ్యాప్ లో అనుష్క కూడా అదే పని చేసింది. విరాట్ ను ఫాలో అవడం మానేసింది. దీంతో రూమర్లకు మరింత బలం చేకూరింది. ఈ ఏడాది బాలీవుడ్ లో చాలా జంటలు బ్రేకప్ చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. అనుష్క కూడా అదే కోవలో చేరడం ఖాయమే అన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి.

ఐతే మిగతా జంటల మాటేమో కానీ.. విరాట్ - అనుష్క మాత్రం చాలా సిన్సియర్ గానే ప్రేమించుకుంటున్నట్లు.. పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపించారు. ఇరు కుటుంబాల మధ్య ఇంతకుముందు మీటింగ్ కూడా జరిగింది. పెళ్లికి ఓకే చెప్పారు కూడా. కానీ ఇంతలో ఈ ‘అన్ ఫాలోయింగ్’లేంటో అర్థం కావడం లేదు. భారత నెంబర్ వన్ క్రికెటర్ గా వెలిగిపోతున్న కోహ్లిని అనుష్క వదులుకునే పరిస్థితి అయితే ఉండదు. బహుశా కోహ్లికే బోర్ కొట్టేసి మరో అమ్మాయినెవరినైనా చూసుకుంటున్నాడో ఏంటో?
Tags:    

Similar News