విరుష్క పెళ్లి ఎపిసోడ్ పూర్తి అయ్యింది. వారి ఫస్ట్ ట్రిప్ హనీమూన్ కూడా వెళ్లి వచ్చేశారు. ఇప్పుడు తమ పెళ్లి సందర్భంగా పిలవాలనుకున్న అతిధుల కోసం రెండు రిసెన్షన్లు ఏర్పాటు చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఒకటి ఢిల్లీలో రెండోది ముంబయిలో.
తాజాగా ఢిల్లీ రిసెప్షన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విందుకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు.ఈ రిసెన్షన్ వేడుకలో ఎర్రరంగు చీరతో.. మెడ మొత్తం కవర్ అయ్యేలా చౌకర్ నెక్లెస్ తో అనుష్క మెరిసిపోయారు. రిసెప్షన్‌లో అందరి కంటిని ఆకర్షించిన అనుష్క నెక్లెస్ విలువ ఎంతన్నది ఇప్పుడు బయటకు వచ్చింది.
పెళ్లి నేపథ్యంలో ఏర్పాటు చేసిన విందుకు అనుష్క ధరించిన ఎరుపు రంగు చీర.. ఎక్కువగా బెంగాళీ మహిళలు పెళ్లిళ్ల సమయంలో ధరిస్తారని ఆ దుస్తుల్ని డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ వెల్లడించారు. ఇక.. విందు సందర్భంగా అనుష్క ధరించిన చోకర్ నెక్లెస్ విలువ రూ.25 నుంచి రూ.30 లక్షల మేర ఉంటుందని చెబుతున్నారు.
రెండో విందును ఈ నెల 26న ముంబయిలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సినీ.. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో పాటు.. వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారని చెబుతున్నారు. అనంతరం వీరు తమ రెండో హనీమూన్ ట్రిప్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు.