ఫోటో దిగే ఛాన్స్ ఇస్తే హీరోయిన్ భుజం మీద చేయి వేశాడు..!

Update: 2023-01-19 07:49 GMT
తెర మీద కనిపించే స్టార్స్ అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ స్టార్స్ మన మధ్యలోకి వస్తే వారిని చూడాలని.. వారితో ఫోటో దిగాలని.. వారిని ఒకసారి టచ్ చేయాలని.. వారితో మాట్లాడాలని ఇలా అందరికి ఉంటుంది. కానీ కొందరు వచ్చిన అవకాశాన్ని తమ చేష్టలతో అతి చేస్తుంటారు. హీరోల పక్కన బౌన్సర్స్ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ హీరోయిన్స్ కే ఎటొచ్చి కొంత ఇబ్బంది ఉంది.

చాలామంది హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చి నలిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్ గా సూరరై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా సినిమా హీరోయిన్ అపర్ణ బాలమురళి కు ఒక వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆమె నటించిన తన్కం రిలీజ్ కు రెడీగా ఉండగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం కేరళలోని ఒక కాలేజ్ కి వెళ్లారు. అక్కడ స్టేజ్ మీద ఉన్న అపర్ణ బాలమురళితో ఫోటో దిగేందుకు ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆమె ఫోటోనే కదా అని లేచి నిలుచుంది ఫోటోకి స్టిల్ ఇచ్చిన అతను ఆమె భుజం మీద చేయి వేయాలని ప్రయత్నించాడు.

అయితే అతను తన మీద చేయి వేస్తున్న విషయం గమనించిన ఆమె వెంటనే తప్పుకుంది. పోనీలే ముచ్చట పడుతున్నారు కదా అని ఫోటో దిగే అవకాశం ఇస్తే అతను చేసిన ఈ పని ఆమెను షాక్ అయ్యేలా చేసింది. పైకి నవ్వుతూ అతన్ని రిజెక్ట్ చేసినా ఆమె లోపల కచ్చితంగా బాధ పడి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళ భామ అయిన అపర్ణ బాలమురళి తన సహజ నటనతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది అపర్ణ బాలమురళి.

ఎన్ని అవార్డులు.. ఎన్ని ప్రశంసలు వచ్చినా హీరోయిన్ అనగానే ఎక్కడో ఒకచోట ఒక చిన్నచూపు కాలేజ్ స్టూడెంట్ కూడా ఆమె మీద చేయి వేయాలని చూశాడు అంటే సమాజం వారిని ఎలా చూస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అతను చేసిన పనికి ఆమె నొచ్చుకుందని తెలుసుకున్న ఆ స్టూడెంట్ ఆమెకు సారీ చెప్పినా చేయాల్సిందంతా చేసి సారీ చెప్పి ఏం లాభం అని నెటిజెన్లు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News