టీజర్ టాక్: అప్పట్లో ఒకడు అదిరే!!

Update: 2016-10-08 04:21 GMT
చాలారోజుల నుండి ''అప్పట్లో ఒకడుండేవాడు'' అనే సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు నారా రోహిత్. అయితే ఈ సినిమా కథేంటి.. ఈ సినిమాలో మ్యాటర్ ఏముంది.. ఇలాంటివన్నీ చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా టీజర్ వచ్చేసింది. 'అయ్యారే' మూవీ ఫేం సాగర్ చంద్ర డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా టీజర్ ఎలా ఉందో తెలుసా..

చాలాకాలం కాస్త గాడితప్పి కమర్షియల్ ఫార్ములాను ఎంచుకున్న రోహిత్.. ఇప్పుడు జో అచ్యుతానందతో ఫామ్ లోకి వచ్చాడు. అందుకే తనకు అచ్చొచ్చిన ప్రయోగాల విభాగంపైనే మరోసారి కన్నేశాడు. 1990లో జరిగే కథలో రోహిత్ ఒక పోలీస్ ఇన్సపెక్టర్ అయితే.. హీరో శ్రీవిష్ణు ఒక నక్సలైట్ గా మారిన క్రికెటర్ రైల్వే రాజుగా నటిస్తున్నాడు. అప్పట్లో సీన్లు.. ఆ వింటేజ్ లుక్స్.. సెటప్ అంతా అదిరిపోయింది. రోహిత్ లుక్స్ యాజూజువల్ డ్యాషింగ్ అయితే.. శ్రీవిష్ణు కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు.

సాయికార్తీక్ మ్యూజిక్.. నవీన్ యాదవ్ ఫోటోగ్రాఫీ.. చెప్పుకోదగిన విషయాలు. అవి రెండూ కూడా సినిమాలోని మూడ్ అండ్ టైమ్ ను పర్ఫెక్ట్ గా రిప్రొడ్యూస్ చేశాయి. మొత్తానికి ఈసారి రోహిత్ ఒక మెగా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు.
Full View

Tags:    

Similar News