ఫస్ట్ టాక్: అప్పట్లో ఒకడుండేవాడు!!

Update: 2016-12-30 05:37 GMT
''అప్పట్లో ఒకడుండేవాడు''. టైటిల్ వినగానే ఏదో డిఫరెంట్ గానే అనిపించింది. దానికి తోడు పోస్టర్లు ట్రైలర్లు చూసినప్పుడు.. 90ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక ఇంటెన్స్ స్టోరీ అని తెలిసిపోయింది. నారా రోహిత్ అండ్ శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ఈరోజే రిలీజైంది. ఇంతకీ ధియేటర్ల దగ్గర టాక్ ఎలా ఉందో తెలుసా?

ముఖ్యంగా సినిమాలో అసలు 1990ల నాటి బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడమే సూపర్ అంటున్నారు. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని రోజుల్లో.. అసలు ప్రజల మనోభావాలు.. స్థితిగతులు.. పరిస్థితులు.. ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారట. పోలీస్ ఇన్సపెక్టర్ గా నారా రోహిత్.. క్రికెటర్ కాబోయి పరిస్థితుల దృష్ట్యా రూటు మార్చుకున్న యువకుడిగా శ్రీవిష్ణు.. అద్భుతమైన నటన పండించడమే కాకుండా.. ప్రతీ సీన్ చాలా ఇంటెన్స్ గా చేశారని టాక్. దర్శకుడు సాగర్ చంద్ర.. అప్పటి తెలంగాణలోని పరిస్థితులు చాలా కళ్లకు కట్టినట్లు చూపించాడనే చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు.. ఆఖరి 30 నిమిషాలూ కిక్ యాస్ అనే టాక్ వినిపిస్తోంది.

మొన్నటివరకు ఓ రెండు మూడు ఫార్ములా కమర్ఫియల్ సినిమాలు ఎంచుకుని తనకు ఉన్న ప్రత్యేకతను కాస్త పాడుచేసుకున్న నారా రోహిత్.. తిరిగి ఈ సినిమాతో తాను కాన్సెప్టులు పికప్ చేస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూపించాడనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడుతో ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెయిట్ ఫర్ తుపాకీ రివ్యూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News