కొంచెం చరిత్ర లోతుల్లోకి సినిమాలు తీయాలంటే అంత సులువైన విషయం కాదు. పదేళ్లు వెనక్కి వెళ్లి ఆ నేపథ్యంలో సినిమా తీయాలన్నా ఆ దర్శకుడికి ఎంతో అవగాహన ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. ఇక రెండు మూడు దశాబ్దాల కిందటి నేపథ్యంలో సినిమా తీయాలంటే అంత చిన్న విషయం కాదు. అప్పటి కాలమాన పరిస్థితుల్ని ఉన్నదున్నట్లు ప్రతిబింబిస్తూ సినిమాలు తీయాలంటే చాలా ఖర్చవుతుంది. భారీ బడ్జెట్లు పెడితే తప్ప ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యం కాదు. ఐతే ‘అయ్యారే’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర.. తన రెండో ప్రయత్నంలో ఓ సాహసోపేత ప్రయత్నమే చేస్తున్నాడు. అతను తెరకెక్కించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో చర్చించిన విషయాల గురించి చెబుతుంటే ఇండస్ట్రీ జనాలే ఆశ్చర్యపోతున్నారు.
నక్సలిజం.. గ్లోబలైజేషన్.. లీగ్ క్రికెట్.. గూండాగిరీ.. రియల్ ఎస్టేట్.. ఇలాంటి ఎన్నో అంశాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంది. ఇండియాకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది 90ల్లోనే. సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన అనేక పరిణామాలు ఆ కాలంలోనే చోటు చేసుకున్నాయి. అప్పట్లో నక్సలిజం ప్రభావం చాలా ఉండేది. సంస్కరణల ప్రభావంతో దేశంలో పెను మార్పులు మొదలైంది కూడా ఆ రోజుల్లోనే. ఇలాంటి అనేక కీలక అంశాల నేపథ్యంలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను నడిపించాడు సాగర్ చంద్ర. మొన్నటి ప్రెస్ మీట్లో అతను చెప్పిన విషయాలు సినిమా మీద అమితాసక్తిని రేపాయి. ఇలాంటి అంశాల్ని సినిమాల్లో చర్చించడం.. ఆ నేపథ్యంలో కథ నడవడం అన్నది అరుదైన విషయం. ప్రోమోలు చూస్తే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాను యువ దర్శకుడు సాగర్ చంద్ర ఎలా డీల్ చేశాడో.. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల్ని ఏమేరకు అందుకుంటాడో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/