మంచి సినిమాకు పట్టం కట్టారు

Update: 2017-01-02 09:31 GMT
సినిమాల ఫలితాల్ని అన్నిసార్లూ సరిగ్గా అంచనా వేయలేం. కొన్నిసార్లు మంచి సినిమాలు అన్యాయం అయిపోతుంటాయి. కొన్నిసార్లు మామూలు సినిమాలు కూడా ఇరగాడేస్తుంటాయి. గత ఏడాది ‘మనమంతా’ అనే మంచి సినిమా ఒకటి వచ్చింది. అందరూ ఆ సినిమా బాగుందన్నారు. కానీ ఆడలేదు. దీనికి కారణం ఏంటి అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఐతే ఏడాది ఆఖర్లో అలాంటి మంచి సినిమా మరొకటి వచ్చింది. అదే.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమాకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డా సరే.. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు మౌత్ టాక్ చాలా బాగుంది. సోషల్ మీడియాలో మూడు రోజులుగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.

మంచి సినిమా అని.. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని కితాబిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ రావడానికి ముందే ఈ ఏడాది బెస్ట్ మూవీస్.. ఫేవరెట్ మూవీస్ అని లిస్టులు తయారు చేసి పెట్టుకున్న వాళ్లంతా.. సినిమా చూశాక ఆ జాబితాల్ని రివైజ్ చేసుకుంటున్నారు. తొలి రోజు మార్నింగ్ షోకు ఓ మోస్తరుగా ఉన్న ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కలెక్షన్లు.. పాజిటివ్ టాక్ వల్ల సాయంత్రానికి బాగా పెరిగాయి. వీకెండ్ అంతా మంచి వసూళ్లే సాధించింది ఈ చిత్రం. కాకపోతే థియేటర్లు ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. సినిమా బాగుంది చూద్దామంటే దగ్గర్లో ఉన్న థియేటర్లలో సినిమా లేకపోవడం ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. థియేటర్లు కొన్ని పెంచినప్పటికీ.. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మంచి సినిమాకు పరిశ్రమ నుంచి కూడా తోడ్పాటు అందితే.. మున్ముందు మరిన్ని మంచి సినిమాలొస్తాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News