నారా రోహిత్ అచ్చమైన ముస్లింలా..

Update: 2016-10-29 15:09 GMT
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ నారా రోహిత్. కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాలకే ఓటేస్తూ వస్తున్న రోహిత్.. తాజాగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ పేరుతో మరో వైవిధ్యమైన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టీజర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. 90ల నాటి నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ‘అయ్యారే’ ఫేమ్ సాగర్ చంద్ర.

నవంబర్లోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ జోరు పెంచింది ఈ చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాలోని రెండు పాటలకు సంబంధించిన టీజర్లు వదిలింది. అందులో ఒకటి ముస్లిం సంప్రదాయ పెళ్లి నేపథ్యంలో సాగే పాట. ఇందులో రోహిత్ అచ్చమైన ముస్లింలా కనిపిస్తున్నాడు. నెత్తిన ముస్లింపు టోపీ పెట్టుకుని.. భాయ్ సాబ్ లాగా తయారయ్యాడు. ముస్లిం పెళ్లిళ్లను కళ్లకు కట్టేలా ఈ పాటను చిత్రీకరించారు. పాట కూడా ఆ తరహాలోనే సాగుతుంది.

దీంతో పాటు రిలీజ్ చేసిన మరో పాట ఈ చిత్రంలో మరో కీలక పాత్ర చేస్తున్న శ్రీవిష్ణు మీద తీసింది. శ్రీ విష్ణు ఇందులో క్రికెటర్ టర్న్డ్ క్రిమినల్ పాత్ర చేస్తున్నాడు. అతడి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఓ అందమైన అమ్మాయితో రొమాన్స్.. అతడి క్రికెట్ కెరీర్ ను టచ్ చేస్తూ సాగుతుందీ పాట. వినడానికి శ్రావ్యంగా ఉందీ పాట. విజువల్స్ కూడా బాగున్నాయి. త్వరలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారు.
Full View
Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News