సైరా సంగతి తప్ప వేరే అడగండి!

Update: 2018-09-27 06:39 GMT
భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో AR రహమాన్ ఒకరు.  అకాడమీ అవార్డ్ మాత్రమే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రహమాన్ విదేశీ చిత్రాలకు కూడా సంగీతం అందించాడు.  మణిరత్నం తాజా చిత్రం 'నవాబ్' కు రహమాన్ సంగీత దర్శకుడు.  'నవాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా రహమాన్ మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

చిత్రమైన విషయం ఏంటంటే.. రహమాన్ 'సైరా' నుండి మీరు ఎందుకు బయటకు వచ్చారనే విషయం పై ప్రశ్నలు తప్ప వేరేవి ఏవైనా అడగండి అని ముందే చెప్పాడట.  దీంతో ఆ ఒక్క టాపిక్ తప్ప మిగతా అంశాలపై మాత్రమే రహమాన్ కు ప్రశ్నలను సంధించవలసి వచ్చింది రిపోర్టర్స్.  ఇక మణిరత్నం తో అనుబంధం గురించి అడిగితే.. అది మాటల్లో చెప్పలేని అనుబంధం అన్నాడు.. "అయనకు ఏం కావాలో నాకు అర్థం అవుతుంది. అలాగా నేను ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేయగలనో అయనకు తెలుసు.  ఇక అయన చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేసే ముందు ఇద్దరం ఒక షార్ట్ ట్రిప్ కు వెళ్తాం. అక్కడ మణి సర్ కు ట్యూన్స్ వినిపిస్తాను" అన్నాడు.  ఇక మిగతావారిలా కాకుండా మణి రత్నం సినిమాకు మొదట ట్యూన్స్ కంపోజ్ చేసిన తర్వాతే లిరిక్స్ యాడ్ చేస్తామని తెలిపాడు.

ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడని అడిగితే ప్రతి చిత్రానికి నేను పని చేయలేను అని.. ఒక సినిమాకు పనిచేయాలంటే నాకు చాలా విషయాలు కుదరాలని చెప్పాడు. సబ్జెక్ట్ ప్రత్యేకమైనదిగా ఉండాలి అని చెప్పాడు. ఇక తెలుగు భాషంటే చాలా ఇష్టమని కాకపోతే ఒక సరైన ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నానని తెలిపాడు.
Tags:    

Similar News