2.0 లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ ఏదీ రాలేదు. ఆ క్రమంలోనే శంకర్ వేరే ప్రాజెక్టులపైనా దృష్టి సారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రోబో శంకర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రానికి సన్నాహకాలు మెగా ఫ్యాన్స్ లో అంతకంతకు వేడి పెంచేస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ సహా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో రామ్ చరణ్ తన మార్కెట్ పరిధిని పెద్ద స్థాయికి విస్తరిస్తున్న సమయంలో శంకర్ తో సినిమాని ప్లాన్ చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.
ఈ సినిమా తెలుగు-తమిళం- హిందీ భాషలలో అత్యంత భారీగా తెరకెక్కి విడుదల కానుంది. ఒక తెలుగు హీరోకి శంకర్ దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి అయితే.. ఇది రామ్ చరణ్ 15 వ చిత్రం కావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
నిజానికి తన సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉండగా శంకర్ చాలా గోప్యతను పాటిస్తుంటారు. దాంతో ఈ క్రేజీ మూవీకి సంబంధించిన లీకులు తప్ప ఏదీ అధికారికంగా వెల్లడి కావడం లేదు. ఇక ఈ చిత్రంలో దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ నటి సుజీ బే కథానాయికగా నటిస్తుందని.. తనతో శంకర్ సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగుతోంది. కమల్ హాసన్ ఇండియన్ 2 లో ఒక పాత్ర కోసం సుజీ బేని ఎంపిక చేసుకన్న శంకర్ ఇప్పుడు చెర్రీ మూవీకి లాక్ చేశారని తెలుస్తోంది. అలాగే రష్మిక మందన ఇందులో మరో కథానాయిక అన్న ప్రచారం తెరపైకి వచ్చింది.
అంతేకాదు.. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం ఇస్తారని ఇప్పటికే కథనాలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం శంకర్ ఏఆర్ రెహమాన్ తో టచ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తాను ఓ తెలుగు చిత్రం చేయబోతున్నానని అభిమానుల ప్రశ్నకు ఎఆర్ రెహమాన్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. దీంతో చరణ్-శంకర్ పాన్-ఇండియన్ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తారని కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ ఎంతగానో అభిమానించే రెహమాన్ తో ఇప్పటికి వర్కవుటైనట్టేనని భావిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ మెగా హీరోతో పని చేయడం కూడా ఇదే అవుతుంది.