రెహమాన్ కిరీటంలో జపాన్ కలికితురాయి

Update: 2016-09-18 05:46 GMT
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందుకున్న గౌరవ పురస్కారాల జాబితా చాలానే ఉంటుంది. రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అలాగే సామాజిక అంశాలకు స్పందిస్తూ కూడా సంగీతం ఇవ్వడం రెహమాన్ ప్రత్యేకత. ఆయన సేవలను గుర్తించిన జపాన్ ప్రభుత్వం.. ఓ అరుదైన గౌరవాన్ని ఆయనకు కట్టబెట్టింది.

తన సంగీతంతో ఆసియా సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు కానీ.. వాటికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా.. గ్రాండ్ ఫుకోకా అవార్డును అందించింది. ఆసియా సంస్కృతిని పరిరక్షించే వ్యక్తులు సంస్థలకు.. ఫుకోకా సిటీ మరియు యొకటోపియా ఫౌండేషన్ లు.. ఈ అవార్డు అందిస్తుంటాయి. గ్రాండ్.. అకడమిక్.. ఆర్ట్స్ అండ్కల్చర్ అంటూ మూడు విభాగాల్లో అవార్డులు అందించగా.. ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో రెహమాన్ కు అవార్డు దక్కింది.

ఈ కొత్త గౌరవంతో రెహమాన్ కిరీటంలో మరో కలికితురాయి చేరిందని.. ఆయన జీవితంలో మరో మైలురాయి అందుకున్నారని చెప్పచ్చు. సంగీతం కోసమే కాకుండా.. సర్వీస్ విషయంలోనూ రెహమాన్ కు వరుసగా అవార్డుల వస్తుండడం విశేషం.
Tags:    

Similar News