ఇప్పుడంటే విలన్ అంటున్నాం కానీ... ఒకప్పుడు ఆయన అందమైన హీరో. రోజా - బొంబాయి సినిమాల టైమ్ లో అమ్మాయిలు అరవింద్ స్వామినే కలగనేవారంటే అతిశయోక్తి కాదు. `నువ్వేమైనా అరవింద్ స్వామి అనుకుంటున్నావా?` అన్న మాటలు కూడా అప్పట్లో కుర్రకారు మధ్య వినిపించేవి. అంతటి అందగాడన్నమాట. ఎందుకో తెలీదు కానీ... కొంత కాలం తర్వాత అరవింద్ స్వామి తెరమరుగై పోయారు. వ్యాపారాల్ని చూసుకొంటూ ఆ రంగంలోనే స్థిరపడిపోయాడు.
సుదీర్ఘకాలం తర్వాత ఈమధ్యే మళ్లీ విలన్ గా ఎంట్రీ ఇచ్చేశాడు. తమిళ చిత్రం తని ఒరువన్‌లో స్టైలిష్ విలన్ గా కనిపించి అదరగొట్టాడాయన. హీరో విలన్ అయితే ఎలా ఉంటుందో ఆయన పాత్ర చూశాక అర్థమైంది. అప్పట్నుంచి అరవింద్ స్వామికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తని ఒరువన్ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ చిత్రంలో విలన్ గా చేసే అవకాశం మళ్లీ అరవింద్ స్వామినే వరించింది. ఆ సినిమా హిట్టయితే ఇక తెలుగు నుంచి అరవింద్ స్వామికి మరిన్ని ఆఫర్లు వెళతాయన్నమాట.
అయితే ఆయన అట్టే విలన్ గా సినిమాలు చేస్తాడో లేదో తెలియదు కానీ... ఆయన దృష్టి ఇటీవల డైరెక్షన్ వైపు మళ్లిందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు స్క్రిప్టులు సిద్ధం చేసి పెట్టుకున్నాడట. వాటిని తమిళంలో కానీ, హిందీలోనే తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. మణిరత్నం శిష్యుడైన అరవింద్ స్వామి డైరెక్టర్ గా మారతాడంటే చాలానే ఆశించొచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని, రొటీన్ గా కాకుండా కొత్తరకమైన సినిమాల్నే వాళ్లు ఆస్వాదిస్తున్నారు కాబట్టి అలాంటి స్క్రిప్టుల్నే సిద్ధం చేసుకొన్నానని అరవింద్ స్వామి చెబుతున్నాడు.