యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' అక్టోబర్ 11 న రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు త్రివిక్రమ్ బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రిలేజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 20 తారిఖున చేయాలని నిశ్చయించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆడియో లాంచ్ ఫంక్షన్ జరపకుండానే డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారట.
ఇది అభిమానులకు కాస్త నిరాశకలిగించే విషయమే గానీ ఈమధ్య కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు ఇలాగే చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ కు బదులుగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేస్తున్నారు. 'అరవింద సమేత' టీమ్ కూడా అదే ట్రెండ్ ను ఫాలో కానున్నారట. సినిమా రిలీజ్ కు కాస్త ముందుగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫంక్షన్ కు తారక్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ.. మామయ్య నారా చంద్రబాబు హాజరవుతారని సమాచారం. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలో జరపాలని అలోచిస్తున్నారట. ఒకవేళ అలా వీలుకాకపోతే ఆంధ్ర లో జరుపుతారట.
ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే - ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై S. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.