యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అరవింద సమేత వీర రాఘవ పూర్తి ఆల్బమ్ ని విడుదల చేసేసారు. నాలుగు పాటలు మాత్రమే ఉంటాయని ముందే చెప్పడంతో పాటు సిడి ఇన్ లే కార్డును నిన్నే విడుదల చేయటంతో ఈ విషయంలో పెద్దగా సస్పెన్స్ ఏమి లేకపోయింది. కాకపోతే రిలీజ్ కాని బాలన్స్ రెండు పాటలు ఎలా ఉంటాయన్న ఆసక్తి మాత్రం పెరిగిపోయింది. ఇక ఆల్బమ్ విషయానికి వస్తే ఊహించినట్టే ఏడ ఉన్నాడో పాట సినిమాలోని థీమ్ తో సాగింది. రాయలసీమ యాసలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గంభీరమైన పదాలతో కక్షల గురించి దాని వల్ల జరుగుతున్న హత్యల వాళ్ళ పడుతున్న నరకం గురించి వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంది. బాహుబలిలో ఒక ప్రాణం తరహాలో కథలో ఉద్దేశాన్ని ఇందులో వివరించే ప్రయత్నం జరిగింది. కాకపోతే అంచనాలకు భిన్నంగా మరీ ఎక్కువ ఎమోషన్ ఉండటంతో ఇది రిపీట్ మోడ్ లోకి రావాలంటే విడుదల అయ్యాకే చూడాలి.
ఇక కొద్దిరోజుల క్రితమే విడుదలైన అనగనగా ఇప్పటికే టాప్ బస్టర్ గా మారిపోయింది. క్యాచీ ట్యూన్ తో అరవింద ప్రేమలో పడేందుకు రాఘవ పడిన యాతనను సిరివెన్నెల వర్ణించిన తీరు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. అరవింద తన ఇంటి పేరు అందుకే అంత పొగరు లాంటి ప్రాసలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇక నిన్న విడుదలైన పెనివిటి ఇందులో మూడో పాట. రామజోగయ్యశాస్త్రి చెప్పినట్టు అద్భుతమైన సాహిత్యం అమరిన ఈ పాటకు కాలభైరవ గొంతు నిండుతనం తెచ్చింది. ఇక సినిమాలో ఉన్న ఒకే ఒక్క డ్యూయెట్ రెడ్డి ఇటు చూడు పాట పోయి రావే మరదలా అంటూ పాత పాటను ప్లే చేసి ఆ తర్వాత బీట్ ని పెంచుకుంటూ పోయి పక్కా మసాలా సాంగ్ గా తమన్ ఇచ్చిన ట్యూన్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఉంది, వేట కత్తికి మీసం పెడితే పూల బొత్తికి ఓని చుడితే అంటూ రామజోగయ్యశాస్త్రి ఈ సారి కిక్కిచ్చే పదాలతో ఆడుకున్నారు. మొత్తానికి అంచనాలకు భిన్నంగా ఒకే ఒక్క మాస్ డ్యూయెట్ ఉన్న ఆల్బమ్ గా దీన్ని త్రివిక్రమ్ చేయించిన తీరు చూస్తే సీమ హింసతో హీరోయిజంని ఓ రేంజ్ లో ముడిపెట్టినట్టు కనిపిస్తోంది.
Full View