రామ్ చరణ్ 'రంగస్థలం' ఇంటా బయటా రికార్డులతో చెలరేగి బాక్సాఫీస్ వద్ద దాదాపు 100కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో ఓవర్సీస్ నుంచే 25 కోట్ల వాటా ఉంది. 50 రోజుల్లో 3.5 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన రంగస్థలం ఓవర్సీస్ లో నాన్ బాహుబలి కేటగిరీలో అన్ని రికార్డుల్ని తిరగరాసింది. అందుకే ఇప్పుడు అగ్రకథానాయకుల సినిమాల్ని రిలీజ్ చేస్తే ఆ రికార్డును బ్రేక్ చేయడమే ధ్యేయంగా భారీగా ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.
'రంగస్థలం' తర్వాత అంతే క్రేజుతో రిలీజవుతున్న సినిమా - అరవింద సమేత. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇంటా బయటా భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ ఈసారి ఫ్యాక్షన్ యాక్షన్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడని ఇటీవల రిలీజైన ట్రైలర్ చెప్పింది. ఆది - సింహాద్రి ఈజ్ బ్యాక్ అంటూ తారక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అందుకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ భారీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
`అరవింద సమేత` చిత్రం రంగస్థలం రికార్డుల్ని కొట్టాలంటే 3.5 మిలియన్ డాలర్ వసూళ్లను అధిగమించి 4మిలియన్ డాలర్ వసూళ్ల క్లబ్‌లో చేరాల్సి ఉంటుంది. అందుకే చాలా ముందే ఓవర్సీస్ బుకింగ్స్ ను ఓపెన్ చేసి న్యూ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. ఓవర్సీస్ లో హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన గత చిత్రం `అజ్ఞాతవాసి` డిజాస్టర్ కావడంతో నిర్మాత రాధాకృష్ణకు కొన్ని చిక్కులు వచ్చాయి. ఆ క్రమంలోనే అజ్ఞాతవాసి పంపిణీదారులకు కాకుండా వేరొకరికి హక్కులు కట్టబెట్టారని, లేదు నష్టాల్ని పూడ్చుకునేందుకు అజ్ఞతవాసి పంపిణీదారుకే ఈ హక్కుల్ని కట్టబెట్టారని రెండు వెర్షన్లు వినిపించాయి. అజ్ఞాతవాసి ఓవర్సీస్ పంపిణీదారులే హారిక సంస్థ నిర్మిస్తున్న మూడు సినిమాలకు గంపగుత్తగా డీల్ కుదుర్చుకుందని ఓ ప్రచారం సాగింది. ఏది వాస్తవం.. ఏది అవాస్తవం అన్నది అటుంచితే `అరవింద సమేత` చిత్రాన్ని ఓవర్సీస్ లో `వైనవి హాన్వీ క్రియేషన్స్` సంస్థ రిలీజ్ చేస్తోందని తెలుస్తోంది. 12 కోట్ల మేర చెల్లించి ఓవర్సీస్(అమెరికా - నాన్ అమెరికా) హక్కుల్ని సదరు పంపిణీ సంస్థ ఛేజిక్కించుకుందిట. త్రివిక్రమ్ సినిమాల్లో నితిన్ అ..ఆ ఓవర్సీస్ కే టాప్ రేంజులో 2.5 మిలియన్ డాలర్ క్లబ్ లో నిలిచింది. ఇప్పటికి ఎన్టీఆర్ `అరవింద సమేత` ఆ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. రంగస్థలం రికార్డుల్ని కొట్టాలంటే తారక్ సినిమా సెన్సేషనల్ హిట్ అని ఓవర్సీస్ నుంచే టాక్ రావాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫార్ములాటిక్ ఫ్యాక్షన్ - యాక్షన్ సినిమాలకు ఓవర్సీస్ లో ఎంతవరకూ ఆదరణ ఉంటుంది? అన్నది చెప్పలేం. కాబట్టి అరవింద సమేత ఓవర్సీస్ ఫలితం ఏంటి? అన్నది అప్పుడే నిర్ణయించలేం. చాలా ముందే బుకింగులు ఓపెన్ అయ్యాయి కాబట్టి ఓవర్సీస్ ప్రీమియర్ల రూపంలో రికార్డులు సృష్టించే ఛాన్సుందేమో చూడాలి!