చెర్రీని ట‌చ్ చేసినా ప‌వ‌న్‌ ని..!

Update: 2018-10-12 03:03 GMT
యంగ్‌ య‌మ ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` రికార్డుల వేట సాగించాల‌ని ఫ్యాన్స్ బ‌లంగా కోరుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే దేశ‌ - విదేశాల్లో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేశారు. ఫ్యాక్ష‌న్‌ - యాక్ష‌న్ త‌ర్వాత ఆ కుటుంబాల్లో ఏం జ‌రుగుతోంది? ఎమోష‌న్ ఎలా ఉంటుంది? అన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. యుద్ధాన్ని ఆపేవాడే మొన‌గాడు! అన్న థీమ్‌ని చూపించారు. ఇది తార‌క్ ఫ్యాన్స్‌ కి బాగానే క‌నెక్ట‌యింది. అంత‌కుమించి క్లాస్ సినిమాల్ని వీక్షించే ఓవ‌ర్సీస్ ఆడియెన్‌ కి ఈ పాయింట్ క‌నెక్ట‌య్యింద‌నే తాజా వ‌సూళ్లు చెబుతున్నాయి.

`రంగ‌స్థ‌లం` లాంటి మాస్ సినిమాని ఆద‌రించిన అమెరిక‌న్ ఆడియెన్ `అరవింద స‌మేత‌- వీర‌రాఘ‌వ‌` లాంటి ఫ్యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ చిత్రాన్ని ఆద‌రిస్తున్నార‌ని ఓపెనింగ్‌ క‌లెక్ష‌న్లు చెబుతున్నాయి. ఆ క్ర‌మంలోనే వీర‌రాఘ‌వ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ రంగ‌స్థ‌లం చిట్టిబాబు అమెరికా ప్రీమియ‌ర్ల‌ రికార్డును కొట్టేశాడు. నాన్ హాలీడే రిలీజైనా అర‌వింద స‌మేత ప్రివ్యూల రూపంలో 5.85 కోట్లు (791కె డాల‌ర్లు) వ‌సూలు చేసి స‌త్తా చాటాడు. కేవ‌లం 281 లొకేష‌న్ల‌లో రిలీజై ఈ స్థాయి వ‌సూళ్ల‌ను సాధించింది ఈ చిత్రం.

రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` 5కోట్ల (707 కె డాల‌ర్ల‌)తో అమెరికా ప్రీమియ‌ర్ల రికార్డును నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` నాన్ బాహుబ‌లి ప్రీమియ‌ర్ల‌లో అగ్ర‌ స్థానంలో ఉంటే ఆ త‌ర్వాత టాప్ 5లో రంగ‌స్థ‌లం నిలిచింది. ఇప్పుడు `రంగ‌స్థ‌లం` ప్రీమియ‌ర్ రికార్డును బ్రేక్ చేసి `అర‌వింద స‌మేత‌` ఒక మెట్టు పైనే ఉంద‌న్న రిపోర్ట్ అందింది. ప‌వ‌న్ `అజ్ఞాత‌వాసి` దాదాపు 500 పైగా లొకేష‌న్ల‌లో రిలీజై 1.1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లతో  ప్రీమియ‌ర్ రికార్డును నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు అర‌వింద స‌మేత అమెరికా వ‌సూళ్ల రిపోర్టును ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్‌ లో ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News