ఈ ఏడాది ద్వితీయార్ధంలో మిగిలిన అతి పెద్ద తెలుగు సినిమా ఇంకొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అందరికీ ముఖ్యమే. కానీ అందర్లోకి ఎక్కువ ఎవరికి కీలకం అంటే.. హీరోయిన్ పూజా హెగ్డే అనే చెప్పాలి. ఎందుకంటే పూజ తెలుగులో అగ్ర కథానాయికగా చలామణీ అయిపోతోంది కానీ.. ఆమె ఖాతాలో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా పడలేదు. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’.. రెండో సినిమా ‘ముకుంద’ ఫ్లాపే అయ్యాయి. ఆ తర్వాత హిందీలో చేసిన ‘మొహెంజదారో’ వల్ల పూజ కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ తెలుగులో పూజకు మంచి మంచి అవకాశాలే వచ్చాయి.
‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. పూజ వల్ల సినిమాకు బాగానే కలిసొచ్చింది. పేరు కూడా వచ్చింది కానీ.. అంతిమంగా ఇది ఫ్లాపే కావడంతో పూజకు ఫ్లాప్ హీరోయిన్ అన్న ట్యాగ్ వచ్చేసింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చేసిన ‘సాక్ష్యం’ ఏమైందో తెలిసిందే. మొత్తానికి ఇప్పటిదాకా పూజకు హిట్ అన్నదే లేదు తెలుగులో. ఇలాంటి తరుణంలో ‘అరవింద సమేత’ వస్తోంది. ఇది తన ట్రాక్ రికార్డును మార్చేస్తుందని పూజ ఆశిస్తోంది. తెలుగులో పూజ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నింట్లోకెల్లా ఇందులో ఆమె కీలక పాత్ర చేస్తోంది. టైటిల్లో కూడా ఆమె పాత్రకు చోటు దక్కింది. ఇందులో హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం గురించి త్రివిక్రమ్ కూడా చెప్పాడు. హీరోలో మార్పు తీసుకొచ్చే ముఖ్య పాత్ర ఆమెది. అదే సమయంలో పూజ గ్లామర్ విందు కూడా బాగానే చేసేలా ఉంది. మరి ‘అరవింద సమేత’కు పూజకు పేరు తేవడంతో పాటు కమర్షియల్ గానూ సక్సెస్ అయితే ఆమె ఆనందానికి అవధులుండవు.