మా గొడ‌వ‌ల్ని వాడు అర్థం చేసుకున్నాడు

Update: 2019-12-23 09:37 GMT
స‌ల్మాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ నుంచి మ‌లైకా అరోరా ఖాన్ విభేధాల కార‌ణంగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల తర్వాత ఎవ‌రి దారిలో వాళ్లు ఉన్నారు. ఆర్భాజ్ ఇప్ప‌టికే ఆండ్రియా నీ జార్జియా తో ప్రేమాయ‌ణం సాగిస్తుండ‌గా.. మ‌లైకా యువ‌ హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా లో ఇది నిరంత‌రం హాట్ టాపిక్.

2017లో ఈ జంట 16 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక‌ప్ చెప్పేయ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ అయ్యింది. వీరు విడిపోయేప్ప‌టికి వార‌సుడు అర్హాన్ కి 12 ఏళ్ల వ‌య‌సు అని .. త‌మ విడాకుల్ని అర్థం చేసుకున్నాడ‌ని ఆర్భాజ్ అంటున్నాడు.  వార‌సుడు త‌న‌తోనే ఉండాల‌న్న కండిష‌న్ తాను పెట్ట‌ లేద‌ని .. ఇలాంటి స‌మ‌యం లో కుమారుడి కి త‌ల్లి అవ‌స‌ర‌మే ఎక్కువ ఉంటుంద‌ని భావించిన‌ట్టు తెలిపాడు.

అర్హాన్ ప్ర‌స్తుతం మ‌లైకా తోనే ఉంటున్నాడు. 18 వ‌య‌సు వ‌స్తే తాను ఎక్క‌డుండా లో నిర్ణ‌యించుకుంటాడ‌ని అది అత‌డి స్వేచ్ఛ‌ కే వ‌దిలేస్తున్నాన‌ని ఆర్భాజ్ అన్నారు. ఎదిగిన పిల్ల‌ల ముందు త‌ల్లిదండ్రుల కొట్లాట‌లు ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో ఊహించేదే. అర్హాన్ చిన్న వ‌య‌సు లో చాలానే చూడాల్సొచ్చింది. అయితే ఇప్పుడు అర్హాన్ ని క‌థా నాయ‌కుడిని చేసేందుకు మ‌లైకా త‌న‌ వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని వార్త‌లొచ్చాయి. త‌న‌కు బాలీవుడ్ లో ఉన్న కాంటాక్ట్స్ దృష్ట్యా అర్హాన్ కి మంచి కెరీర్ ఉంటుంద‌న‌డం లో సందేహం లేదు.
Tags:    

Similar News