ఒక చేత్తో చప్పట్లు కుదిరే పనేనా? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు! గత కొంతకాలంగా మలైకా అరోరాఖాన్ - ఆర్భాజ్ ఖాన్ వ్యవహారం ఇలానే ఉంది. ఆ ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నా.. ఆ ఇద్దరికీ మరో ఇద్దరు తోడవ్వడం బాలీవుడ్ లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈ జంట విడాకులు తర్వాత ఎవరికి వారు విడివిడిగా వ్యక్తిగత స్నేహాల్ని మెయింటెయిన్ చేయడంపై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. మలైకా - అర్జున్ కపూర్.. ఆర్భాజ్ - ఆండ్రియానీ జంటలను బాలీవుడ్ మీడియా వెంటాడుతోంది. ఈ జోడీలు ఎక్కడ కనిపించినా రకరకాల కథనాల్ని వండి వారుస్తోంది. మలైకా- అర్జున్ కపూర్ జంట ఏప్రిల్ లో పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రఖ్యాత క్వింట్ ఓ కథనం వెలువరించింది. ఇప్పటికే ఓ ఇల్లు కూడా కొనుక్కుని అన్నిటికీ ప్రిపేరవుతున్నారని కథనం ప్రచురించడం సంచలనమైంది.
ఆ వార్త వచ్చిన రెండ్రోజుల్లోనే ఆర్భాజ్ ఖాన్ నుంచి వేడెక్కించే ప్రకటన వెలువడింది. ``మేం స్నేహితులం .. డేటింగ్ లో ఉన్నాం`` అంటూ తన గాళ్ ఫ్రెండ్ జార్జియా ఆండ్రియానీ గురించి ఓపెన్ అయ్యాడు. ఇంతకాలం తను కేవలం స్నేహితురాలు మాత్రమేనని చెప్పిన ఆర్భాజ్ ఇప్పుడు బహిరంగంగా తమ మధ్య అనుబంధాన్ని ప్రకటించడంపై ముంబైలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్భాజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆండ్రియానీని పెళ్లాడుతున్నారా? అన్న ప్రశ్నకు అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. కొన్నిటికి కాలమే సమాధానమిస్తుందంటూ దాట వేయడం ఇక్కడ ఆసక్తికర ట్విస్ట్.
ఆండ్రియాని నన్ను అర్థం చేసుకుంది. అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తుంది. ఆమె నా జీవితంలోకి రావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మలైకా పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తూ.. జీవితంలో రకరకాల ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల జీవితం అక్కడే ఆగిపోకూడదు. కొన్నిటిని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయాలి అంటూ సెటైర్ వేశాడు. మరోవైపు మలైకా అరోరాఖాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం నా జీవితం చాలా బావుంది. ఇంతకంటే నన్ను ఎక్కువ ప్రశ్నించవద్దు.. నా విషయంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు కదా! తెలిసినదే ఎందుకు ప్రశ్నిస్తారు? అంటూ అసహనం వ్యక్తం చేసింది మలైకా. మొత్తానికి ఆర్భాజ్ ఓపెన్ అవ్వడంతో మరోసారి మలైకా ఫ్యాన్స్ లోనూ వేడెక్కించే చర్చ సాగుతోంది. మలైకా - ఆర్భాజ్ ఇద్దరూ అన్నిట్లో ఓపెన్ అవ్వలేదు. ఇకపై అంతా ఓపెన్ అయినట్టేనని ముచ్చటించుకుంటున్నారు.