త‌మిళ‌నాడులో థియేట‌ర్లు తెరిచారా.. ఏంటీ సీను?

Update: 2020-11-02 05:30 GMT
ఏపీ తెలంగాణ‌లో పాక్షికంగా అయినా థియేట‌ర్లు తెర‌వలేదు. తెరుచుకునేందుకు అనుమ‌తించినా ఇక్క‌డ ఎవ‌రూ డేర్ చేయ‌డం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వినోదం పూర్తిగా బోసి పోయింది. మ‌రి త‌మిళ‌నాడులో ప‌రిస్థితి ఎలా ఉంది?  థియేట‌ర్లు తెరిచారా లేదా? ఇంత‌కీ ఈ సంవత్సరం ద‌ళ‌ప‌తి విజయ్ న‌టించిన క్రేజీ మూవీ మాస్టర్ ని విడుదల చేస్తారా.. లేదా?
 
ఈ సీజన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో తమిళ స్టార్ విజయ్ మాస్టర్ ఒకటి. లాక్ డౌన్ లో అంత‌కంత‌కు పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల కారణంగా ఏప్రిల్ రెండవ వారంలో విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడింది.

ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం చివరికి నవంబర్ 10 నుండి తమిళనాడు అంతటా ఎగ్జిబిటర్లను తిరిగి థియేట‌ర్ల‌ను తెరవడానికి అనుమతించింది. అయితే ఒక్కో ప్రదర్శనకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే సినిమా చూడటానికి అనుమతిస్తారు.

ప్ర‌స్తుతానికి `మాస్టర్` మూవీ థియేటర్ విడుదలపైనే క‌ళ్ల‌న్నీ.  తాజా సంచలనం ఏమిటంటే ఈ చిత్రం క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సీజన్లలో రిలీజ్  చేసేందుకు ఆస్కారం ఉంద‌ట‌. విశాల్ న‌టించిన ఓ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న స‌మాచారం ఉంది.
Tags:    

Similar News