అడవి శేషు హీరోగా స్పై థ్రిల్లర్ `గుడాఛారి`(2018) టాలీవుడ్ లో పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయం నేపథ్యంలో సీక్వెల్స్ తీస్తున్నామని ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. సక్సెస్ మీట్లు..ఇంటర్వూల్లో `జేమ్స్ బాండ్` సిరీస్ లా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తామన్నారు. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు పనిచేస్తారని కథానాయకుడు కం రచయిత శేషు స్వయంగా ప్రకటించారు.
కానీ ఇప్పటివరకూ శేషు అండ్ టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. గుడాఛారి రిలీజ్ అయి ఏడాదిన్నర పైగా అయ్యింది. కానీ ఇప్పటి వరకూ పార్ట్ -2ని ప్రారంభించలేదు. అటు తొలి భాగాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నుంచి కూడా ఎలాంటి లీకులు అందలేదు. అయితే గుడాఛారి -2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు తొలి భాగం రిలీజ్ అయిన వెంటనే ప్రారంభించామని అప్పట్లోనే తెలిపారు. పార్ట్ -1కి ఏమాత్రం తగ్గకుండా కథ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ప్రారంభమవుతుందని... ఎంచుకున్న పాయింట్ ఎగ్జయిటింగ్ గా ఉంటుందని రివీల్ చేసారు. కానీ సంవత్సరాలు గడుస్తోంది గానీ.. ప్రాజెక్ట్ అప్ డేట్స్ మాత్రం రాలేదు.
దీంతో ఈ ప్రాంచైజీ కి కొనసాగింపు ఉంటుందా? అక్కడితోనే ఆపేసారా? అన్న సందేహాలు ఫిలిం సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. అటు కథానాయకుడు శేష్ నుంచి కానీ నిర్మాతల వైపు నుంచి కానీ సరైన క్లారిటీ అయితే లేదు. సహజంగా హిట్ అయిన ప్రాంచైజీ నుంచి కొనసాగింపు భాగం రావాలంటే ఆలస్యమవుతుంది. బాలీవుడ్ లో ధూమ్... క్రిష్ లాంటి భారీ ఫ్రాంఛైజీల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. కానీ వీటిపై మాత్రం మీడియా అటెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వినిపిస్తుంది. కానీ గుడాఛారి విషయంలో మాత్రం అలాంటి హైప్ క్రియేట్ అవ్వడం లేదు. మరి ఆలస్యమైతే మొదటికే ప్రమాదం ఉంది.