సరిగ్గా నెల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్.యూ.వీని తనకు తానే పుట్టినరోజు కానుకగా ఇచ్చుకున్నాడు. ఇప్పుడు బాంద్రాలోని ఎగ్జోటిక్ సీఫేసింగ్ స్కై విల్లాకు గర్వించదగిన యజమాని అయ్యాడు. ఇది అతని లేడీలవ్ మలైకా అరోరా కి చెందిన అత్యంత విలాసవంతమైన ఇంటికి చేరువగా ఉంది. ఆ విధంగా మలైకా .. అర్జున్ ఇరుగు పొరుగు అయ్యారు.
బాలీవుడ్ లో ఖరీదైన ఫేజ్ 3 జనం నివసించే కాస్ట్ లీయెస్ట్ ప్లేస్ ఇది. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ ఖాన్ - రణబీర్ కపూర్ లతో సహా ఆ పరిసరాల్లో నివసించే ప్రముఖులందరూ అర్జున్ కి ఇప్పుడు ఇరుగు పొరుగు అన్నమాట.
ఇది సువిశాలమైన 4BHK అపార్ట్ మెంట్. సముద్ర ముఖంగా ఉన్న ఆస్తి కాబట్టి 20 నుండి 23 కోట్ల రూపాయలు పెట్టాల్సొచ్చింది. ఈ ఇల్లు బాంద్రా వెస్ట్ లోని 26 అంతస్తుల భవంతిలో ఉంది. 81 ఆరియేట్ స్కై టవర్ లోనే ఇంతకు ముందు సోనాక్షి సిన్హా కూడా స్కై విల్లా కొన్నారు.