బాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులకు హీరో అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. ఇద్దరు గత కొంత కాలంగా చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్ళింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్న విషయం అధికారికంగా ఒప్పుకోవడం లేదు. కానీ పలు సందర్భాల్లో ఇద్దరు కూడా తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ... మలైకా అరోరా తో తన ప్రేమ విషయాన్ని మాట్లాడకుండా ఆమె అంటే ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశాడు. మలైకా 20 ఏళ్ల వయసు నుండి కూడా స్వతంత్ర భావాలతో సొంతంగా జీవితాన్ని గడుపుతుంది. ఆమె ఎంతోమందికి ఆదర్శంగా స్వాతంత్ర్య మహిళగా నిలిచింది. అందుకే ఆమె అంటే నాకు ఇష్టం. ఆమె నుండి నా జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఆమెతో స్నేహం నాకు కొత్త జీవితాన్ని అందిస్తుంది. ఆమె వల్ల నేను ఎప్పుడు నాపై నేను నమ్మకంతో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత చెప్పిన అర్జున్ కపూర్ ఆమెతో పెళ్లి విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఆమె అంటే ఇష్టం గౌరవం అంటున్న అర్జున్ కపూర్ ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా మాత్రం చెప్పడం లేదు. పెళ్లి విషయం గతంలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు సహజీవనం పై మాత్రమే ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.