ఆమెతో పిల్లలు కావాలి.. పెళ్లి మాత్రం వద్దు.. స్టార్ హీరో ఘాటు వ్యాఖ్యలు

Update: 2022-02-19 02:30 GMT
బాలీవుడ్ లో స్టార్ హీరోలు, సినీ ప్రముఖుల పెళ్లిళ్లు నిలబడడం లేదు. ప్రముఖులు సైతం ఈ మధ్యకాలంలో విడిపోతున్నారు. అందుకే పెళ్లి కంటే సహజీవనమే ముద్దు అంటున్నారు. బాలీవుడ్ లో ఇలా లివింగ్ రిలేషన్ కొత్తేమీ కాదు.. చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

ఇలా సహజీవనంలో ఉండగా ఆ జంటకు పిల్లలు కలిగితేనే సమస్య. తల్లిదండ్రులుగా మారితే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల 'ఐ' హీరోయిన్ అమీ జాక్సన్ ఏకంగా పెళ్లి కాకుండానే ప్రియుడితో బిడ్డను కని ఆ తర్వాత బ్రేకప్ చెప్పి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు మరొక నటుడితో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కూడా ప్రియురాలితో కలిసి ఒక బాబును కన్నాడు. కానీ పెళ్లి మాత్రం వద్దంటున్నాడు. కానీ పెళ్లి మాత్రం వద్దంటున్నాడు.

తన విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అర్జున్ రాంపాల్ తన భార్య మెహర్ జెసియాకు విడాకులిచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్ తో సహజీవనం చేస్తున్నారు. 2019లో వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఆ బాబుకు అరిన్ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే బాబు కూడా పుట్టాడు కదా పెళ్లితో ఒక్కటి కావచ్చు కదా అని అంటే.. పెళ్లి మాత్రం వద్దు అంటున్నాడు అర్జున్.

మా ఈ 'బంధాన్ని' నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదని.. మనసులు కలిసిన రోజే మా వివాహం అయిపోయినట్లేనని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భార్యభర్తల కన్నా మేమేమీ తక్కువ కాదని.. ఇలా ఈ బంధాన్ని వివాహంతో ముడివేయడం తనకంటే గాబ్రియెల్లాకే ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
Tags:    

Similar News