రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కెరీర్ లో మూడు నాలుగు బ్లాక్ బస్టర్లు అతడిని పైకి లేపాయి. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి` సంచలన విజయం సాధించడంతో గాళ్స్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ లోనే రిలీజైనా ఇరుగు పొరుగు భాషల్లోకి రీమేకై అక్కడా సంచలన విజయాలు దక్కడంతో.. విజయ్ పేరు అటువైపూ మార్మోగింది. తెలుగు వెర్షన్ అర్జున్ రెడ్డి ని చూసి ఇతర భాషల ఫ్యాన్స్ తరించారు. ఇక ఈ సినిమా కంటెంట్ పరంగా పాన్ ఇండియా లెవల్లో మార్మోగింది. కబీర్ సింగ్ టైటిల్ తో బాలీవుడ్ లో రీమేక్ అయ్యి షాహిద్ కపూర్ కెరీర్ కి పెద్ద ప్లస్ అయ్యింది. అటు తమిళంలో ధ్రువ్ కి గుర్తింపునిచ్చింది అర్జున్ రెడ్డి తమిళ రీమేక్. ఇక టాలీవుడ్ లో ఆ ఒక్క సక్సెస్ విజయ్ కెరీర్ నే మార్చేసింది. అదే ఊపూలో `గీతగోవిందం` రూపంలో మరో భారీ విజయం రౌడీ స్టార్ స్పీడ్ కి మరింత ప్లస్ అయ్యింది. అటుపై వరుసగా కమిట్ మెంట్లతో బిజీ అయ్యాడు. ఆ క్రేజ్ తోనే బోలెడన్ని అవకాశాలు అందుకున్నాడు.
ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తున్నాడా? అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు ఉందా? అంటే లేనేలేదని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు విజయ్ క్రేజును మసకబారేలా చేశాయి. గీతగోవిందం తర్వాత రౌడీ స్టార్ ఐదు సినిమాలు చేసాడు. అందులో టాక్సీవాలా యావరేజ్ గా ఆడింది తప్ప మిగిలిన సినిమాల్లో ఏదీ అంచనాలను అందుకోలేదు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన `వరల్డ్ ఫేమస్ లవర్` కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. అర్జున్ రెడ్డిలా పెద్ద సక్సెస్ అవుతుందని ప్రయోగానికి పోయి రౌడీ చేతులు కాల్చుకున్నాడని విమర్శలు ఎదురయ్యాయి.
ఇలా వరుస పరాజయాల నడుమ రౌడీ స్టార్ మార్కెట్ అయితే బాగా డౌన్ అయిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ వసూళ్లనే అందుకు ప్రామాణికంగా తీసుకుని విజయ్ మార్కెట్ ని ఎనాలసిస్ చేస్తున్నారు. వరుసగా నాలుగు పరాజయాలు విజయ్ ని మార్కెట్ పరంగా డౌన్ ఫాల్ అయ్యేలా చేసాయని ఇన్ సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. మరి వీటన్నింటికి విజయ్ చెక్ పెట్టాలంటే? తదుపరి సినిమాతో హిట్టు కొట్టి సత్తా చాటాల్సిందే. ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో `ఫైటర్` లో నటిస్తున్నాడు. పూరి ఈ చిత్రాన్ని విజయ్ తో చాలా కసిగా చేస్తున్నాడు. కాబట్టి ఫైటర్ అంచనాలైతే బాగానే ఉన్నాయి. విజయ్ కన్నా పూరి పైనే ఫ్యాన్స్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. మరి విజయ్ కి సక్సెస్ ఇచ్చే బాధ్యత పూరితో పాటు కరణ్ జోహార్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ డౌన్ ఫాల్ నేపథ్యంలో అతడిని పైకి ఎత్తేందుకు ప్రచారార్భాటం ఆ రేంజులోనే నెత్తికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కరణ్ జోహార్ తో 100 కోట్లకు రౌడీ స్టార్ డీల్ కుదుర్చుకున్నాడని ప్రచారమవుతోంది. కరణ్ దర్శకత్వం వహించే లేదా నిర్మించే సినిమాల్లో అతడు నటించాల్సి ఉంటుందట. ఇదే నిజమైతే విజయ్ దశ- దిశ తిరిగిపోయినట్టే అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. అసలు ఫైటర్ రిలీజ్ కావాలి. హిట్టు కొట్టాలి. ఆ తర్వాత కదా ఎలాంటి డీల్ అయినా అంటూ దీనిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. సెంటిమెంట్ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ మాత్రమే భారీ డీల్స్ కి ఆస్కారం కల్పిస్తుంది. వరుస ఫ్లాపులు కానే కాదని విమర్శిస్తున్నారు కొందరు.