అమెరికాలో అర్జున్ రెడ్డి ఆగ‌ట్లేదుగా!

Update: 2017-09-05 10:01 GMT
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క‌లెక్ష‌న్ల సునామీ రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో కూడా అర్జున్ రెడ్డి క‌లెక్ష‌న్ల అరాచ‌కం కొన‌సాగుతోంది. అక్క‌డ రెండో వారంలో కూడా ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం ఆగ‌డం లేదు. తాజాగా విడుద‌లైన పైసా వ‌సూల్ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవడంతో అర్జున్ రెడ్డి క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా 1.5 మిలియ‌న్ మార్క్ ను దాటి 2 మిలియ‌న్ల క్ల‌బ్ లో చేరేందుకు దూసుకుపోతోంది.  నాని న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రికార్డుల‌ను అర్జున్ రెడ్డి బ్రేక్ చేసింది. ఉత్త‌ర అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన తెలుగు చిత్రాల జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుద‌లై అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన భార‌తీయ‌ చిత్రాల జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీస్ జాలీ ఎల్ ఎల్ బీ 2 - టాయిలెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ చిత్రాల రికార్డుల‌ను ఈ వారం బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశ‌ముంది.

ఆల్ టైం టాప్ గ్రాస‌ర్స్‌

బాహుబ‌లి 2 (2017) $20,571,695

బాహుబ‌లి (2015) $6,999,312

శ్రీ‌మంతుడు (2015) $2,890,786

అ ఆ... (2016) $2,449,174

ఖైదీ నెం.150 (2017) $2,447,043

ఫిదా (2017) $2,066,937

నాన్న‌కు ప్రేమ‌తో (2016) $2,022,392

అత్తారింటికి దారేది (2013) $1,897,541

జ‌న‌తా గ్యారేజ్‌ (2016) $1,800,404

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి (2017) $1,662,775

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు (2013) $1,635,300

ఊపిరి (2016) $1,569,162

దూకుడు (2011) $1,563,466

మ‌నం (2014) $1,538,515

అర్జున్ రెడ్డి (2017) $1,513,353

ఆగ‌డు (2014) $1,482,435

ధ్రువ‌ (2016) $1,472,969

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ (2015) $1,430,026

రేసు గుర్రం (2014) $1,394,655

1 నేనొక్క‌డినే (2014) $1,330,155

బాద్షాహ్‌ (2013) $1,278,610

S/O స‌త్య‌మూర్తి (2015) $1,250,000

పెళ్లి చూపులు (2016) $1,222,644

కాట‌మ‌రాయుడు (2017) $1,162,059

బ్ర‌హ్మోత్స‌వం (2016) $1,157,978

నిన్నుకోరి (2017) $1,153,085

దువ్వాడ జ‌గ‌న్నాథం (2017) $1,148,686

నేను లోక‌ల్‌ (2017) $1,196,559

ఈగ‌ (2012) $1,071,281

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌ (2016) $1,070,404

టెంప‌ర్‌ (2015) $1,052,650

గ‌బ్బ‌ర్ సింగ్ (2012) $1,034,484

2017: అమెరికాలో ఇండియ‌న్ టాప్ సినిమాలు

బాహుబ‌లి 2 - $20,571,695

ర‌యీస్‌ - $3,633,008

ఖైదీ నెం.150 - $2,447,043

ఫిదా - $2,066,937

బ‌ద్రినాథ్ కీ దుల్హ‌నియా - $1,975,957

జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌ - $1,935,567

జాలీ ఎల్ ఎల్ బీ 2 - 1,687,530

టాయిలెట్: ఏక్ ప్రేమ్ క‌థ‌ - $1,663,338

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి - $1,662,775

ట్యూబ్ లైట్‌ - $1,576,244

అర్జున్ రెడ్డి - $1,513,353
Tags:    

Similar News