రెండు వారాల్లో 22 కోట్లు పట్టేశాడు

Update: 2017-09-09 09:38 GMT
విడుదలకు ముందే బంపర్ క్రేజ్ వచ్చింది. విడుదల తర్వాత అదిరిపోయే టాక్ వచ్చింది. దీనికి తోడు అనేక వివాదాలు తోడయ్యాయి. పోటీగా వచ్చిన.. వస్తున్న సినిమాలు తేలిపోతున్నాయి. ఇంకేముంది ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర దున్నుకుంటున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ రెండు వారాల్లో రూ.22.6 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టడం విశేషం. గ్రాస్ రూ.42 కోట్ల దాకా ఉంది. మూడో వారంలోనూ ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్.. రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటినా ఆశ్చర్యం లేదు. ఒక్క నైజాం ఏరియాలోనే ‘అర్జున్ రెడ్డి’ రూ.8 కోట్ల దాకా షేర్ రాబట్టడం అనూహ్యమైన విషయం. అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి 2 మిలియన్ల దిశగా అడుగులు వేస్తోంది.

ఏరియాల వారీగా రెండు వారాల్లో ‘అర్జున్ రెడ్డి’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..

నైజాం (తెలంగాణ)- రూ.7.98 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.1.26 కోట్లు

సీడెడ్ (రాయలసీమ)- రూ.1.95 కోట్లు

తూర్పు గోదావరి- రూ.91 లక్షలు

పశ్చిమ గోదావరి- రూ.54 లక్షలు

గుంటూరు- రూ.99 లక్షలు

కృష్ణా- రూ.1 కోటి

నెల్లూరు- రూ.38 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.15 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్ 25.2 కోట్లు

యుఎస్- రూ.5.35 కోట్లు

కర్ణాటక- రూ.1.14 కోట్లు

మిగతా ఏరియాల్లో- రూ.1.1 కోట్లు

వరల్డ్ వైడ్ షేర్- రూ.22.6 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.41.5 కోట్లు
Tags:    

Similar News