అల ఇంకా ట్రెండ్డింగ్‌లోనే ఉంది

Update: 2020-08-26 13:00 GMT
ఈ ఏడాదిలో అతి తక్కువ సినిమాలు వచ్చాయి. వచ్చిన వాటిలో అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ ల అల వైకుంఠపురంలో ఒకటి. ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా నిలిచింది. వసూళ్ల పరంగా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అంతకు మించి మ్యూజికల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. సినిమాలోని ప్రతి పాట కూడా యూట్యూబ్‌ లో మిలియన్‌ ల కొద్ది వ్యూస్ ను దక్కించుకున్నాయి. సినిమా వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. ఇక పాటలు వచ్చి దాదాపుగా పది నెలలు అవుతున్నాయి. అయినా కూడా ఇంకా ట్రెండ్డింగ్‌ లోనే ఉన్నాయి.

కరోనా కారణంగా పెద్ద సినిమాలు ఏమీ రాకపోవడం, పాటలు ఏమీ లేకపోవడం ఒక కారణం అయితే పాటలు ఎంతగా విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. ఆ కారణంగానే అల వైకుంఠపురంలో సినిమా పాటలు అన్ని ప్లాట్‌ ఫామ్స్‌ లో కూడా ఇంకా హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ పాటకు అంతర్జాతీయ స్తాయిలో కూడా గుర్తింపు వచ్చింది అంటే ఆశ్చర్యం లేదు. ఇండియా వైడ్‌ గా ఈ పాట ఇంకా కూడా ట్రెండ్డింగ్‌లో ఉంది. తాజాగా ఈ విషయాన్ని గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు.

ఇండియాలోని టాప్‌ 100 సాంగ్స్‌ లో బుట్టబొమ్మ సాంగ్‌ 7వ స్థానంలో ట్రెండ్‌ అవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇది ఇప్పటికి ఆగదు, ఇది ఎప్పటికి ఆగదు అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ఏడాది మొత్తం కూడా బుట్టబొమ్మ పాటతో పాటు అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. థమన్‌ మరియు బన్నీ కెరీర్‌ లో ఇదే బిగ్గెస్ట్‌ మ్యూజిల్‌ హిట్‌ గా చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News