అదో చెత్త పాత్ర అని మనకి ముందే తెలుసు!

Update: 2022-03-18 03:30 GMT
బాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ గా అర్షద్ వర్షి కనిపిస్తాడు. ముఖ్యమైన .. కీలకమైన పాత్రలలో తెరపై కనిపిస్తూ ఆయన సందడి చేస్తుంటాడు. పాత్రను బట్టి తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకునే నటుల్లో ఆయన స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాంటి అర్షద్ 'బచ్చన్ పాండే' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు.

ఫర్హద్ సాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నాయికగా కృతి సనన్ అలరించనుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది.

గతంలో వచ్చిన 'మున్నాభాయ్' సిరీస్ లో అర్షద్ సర్క్యూట్ పాత్రను పోషించాడు. ఈ పాత్రలో తెరపై ఆయన సందడి చేశాడు. తాజాగా 'బచ్చన్ పాండే' ప్రమోషన్స్ లో అర్షద్ దగ్గర 'మున్నాభాయ్' సినిమా .. ఆ సినిమాలో ఆయన పోషించిన సర్క్యూట్ పాత్రకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది.

అప్పడూ ఆయన స్పందిస్తూ .. " అదో చెత్త పాత్ర .. ఆ పాత్రలో ఏ మాత్రం విషయం లేదనే సంగతి నాకు ముందే తెలుసు. 'మున్నాభాయ్' గా సంజయ్ దత్ చేస్తున్నాడని తెలిసి ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాను .. అంతే.  

నిజానికి ఈ పాత్రలో పస లేదనే సంగతి దర్శకుడు రాజ్ కుమార్ హిరాణికి కూడా తెలుసు. ఈ పాత్ర కోసం ముందుగా మకరంద్ దేశ్ పాండేను అడిగారట. అయితే ఆ పాత్ర ఆయనకి నచ్చకపోవడం వలన చేయనని చెప్పాడట. అప్పుడు వాళ్లు నన్ను అడిగారు.

నాకు కూడా ఆ పాత్ర నచ్చలేదు .. చెప్పను గదా .. ఆ పాత్రను కేవలం సంజయ్ దత్ కోసమే చేశాను. ఇక ఇప్పుడు 'బచ్చన్ పాండే' సినిమాలో నా పాత్ర నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News