#BIGGBOSS5TELUGU : ప్రియా ఆంటీ ఎందుకు ఇలా చేశారు

Update: 2021-09-21 10:30 GMT
బిగ్‌ బాస్ సీజన్ ప్రారంభం అయిన ప్రతిసారి కూడా ప్రతి కంటెస్టెంట్స్ కూ అభిమానులు ఏర్పడుతూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ప్రతి కంటెస్టెంట్స్ కు కూడా అభిమానులు సోషల్‌ మీడియాలో ఆర్మీలు ఏర్పాటు చేసి మరీ ఫాలో అవుతూ ఉంటారు. ఈ సీజన్ లో కూడా చాలా మంది కంటెస్టెంట్స్ ను నెటిజన్స్‌ తెగ అభిమానిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ప్రియా ఆంటీ ఆర్మీ అంటూ చాలా మంది ఆమెను అభిమానించే వారు. కాని ఇప్పుడు మాత్రం ఆమెను వారే విమర్శిస్తున్నారు. ఇలా ఎలా మాట్లాడుతారు ప్రియా గారు అంటూ ఆమెను తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రియా ఆంటీ ఎలిమినేషన్  నామినేషన్‌ సమయంలో చేసిన రచ్చ హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆమెను సోషల్‌ మీడియాలో కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

లహరి తన వంతు వచ్చిన సమయంలో ప్రియాను నామినేట్ చేసింది. తాను ప్రియా గారితో కలిసేందుకు ప్రయత్నించినా వీలు పడటం లేదు అంటూ లహరి చెప్పగా ఆ సమయంలో నీవు అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావు.. మాతో సమయం ఎక్కడ నువ్వు గడుపుతావు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఎక్కువగా నీవు అబ్బాయిలతో ఉంటున్నావు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు లహరికి కోపం తెప్పించాయి. ఆ సమయంలోనే రవి కూడా స్పందిస్తూ ఆ విషయాన్ని ఖండించాడు. ఆ తర్వాత ప్రియా తన వంతు వచ్చిన సమయంలో మాట్లాడుతూ లహరి మరియు రవిలు లేట్ నైట్‌ రెస్ట్‌ రూమ్స్ వద్ద హగ్‌ చేసుకున్నారు అంటూ రెట్టించి చెప్పింది. అబ్బాయిలతోనే ఎక్కువగా ఉంటున్నావు అంటూ కూడా ప్రియా మాట్లాడటంతో లహరి చాలా సీరియస్ అయ్యింది. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు పెద్ద వారని గౌరవం ఇస్తున్నా కూడా మీరు ఇలా మాట్లాడటం సరి కాదని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

లహరి మరియు ప్రియాల గొడవ విషయంలో చాలా మంది లహరికి మద్దతు తెలుపుతున్నారు. ఇన్ని రోజులు ప్రియా ఆంటీ అంటూ సపోర్ట్‌ చేసిన నెటిజన్స్ కొందరు కూడా ఇలా ఎందుకు చేశారు ఆంటీ అంటూ ఆమె తీరును తప్పబడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు మరియు ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రియా గారి నుండి ఇలాంటి వ్యాఖ్యలు సబబు కాదు అంటూ తప్పుబడుతున్నారు. ప్రియా గారు ప్రతి విషయంలో కూడా మెచ్యూర్డ్‌ గా మాట్లాడేవారు. ఆమెను చాలా మంది సమర్థించిన సందర్బాలు ఉన్నాయి. కాని ఈమద్య కాలంలో ఆమె అదుపు తప్పి మాట్లాడటం ఆలోచన లేకుండా వ్యవహరించడం చేస్తున్నారు అంటూ ప్రియాపై విమర్శలు చేసే వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి ప్రియా ఎలిమినేట్‌ అవ్వాలని కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగి పోతుంది.
Tags:    

Similar News