‘తలైవి’ సినిమా యూనిట్ వదిలిన ఓ పిక్ ఇప్పుడు తమిళనాట విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో అరవిందస్వామి అచ్చం ఎంజీఆర్లాగానే ఉన్నారు. దీంతో తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషించారు. అయితే తమిళుల ఆరాధ్యదైవం, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి పోషిస్తున్నారు.
ఎంజీఆర్ తమిళనాట గొప్ప మాస్ హీరో. ఇప్పటికీ అక్కడి ప్రజలకు ఎంజీఆర్ అంటే ఎంతో ఆరాధభావన ఉంటుంది. ఈ క్రమంలో ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి పోషించడం.. అచ్చం ఎంజీఆర్‌లాగే అతడు ఉండటంతో తమిళ ప్రజలు ఖుషీలో మునిగిపోయారు. ఇప్పుడీ స్టిట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. తలైవి చిత్రం ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆసక్తిని రేకెత్తించాయి. అయితే జయలలిత.. ఎంజీఆర్‌కు వారసురాలిగా తమిళనాట ఖ్యాతిని సంపాధించారు. అయితే జయలలిత.. ఎంజీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా చూపించబోతున్నారని ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నది.వరుస బెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హిట్లు కొడుతూ దూసుకు పోతున్న కంగనా రనౌత్ తలైవి సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.