ప్రస్తుతం టెలివిజన్ రంగంలో రియాల్టీ షోలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో, బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రకరకాల రియాల్టీ షోలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. అయితే, వీటిలో కొన్ని షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరికొన్ని వివాదాస్పదమయ్యాయి. బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్ `స్వయంవర్` పేరుతో చేసిన రియాల్టీ షో పై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ షోలో విజేతను పెళ్లి చేసుకుంటానని ప్రకటించి...చివరకు మొహం చాటేసింది. తాజాగా, అదే తరహాలో తమిళ హీరో ఆర్య `స్వయంవరం` పేరుతో నిర్వహిస్తోన్న రియాల్టీ షో వివాదాస్పదమైంది. ఆ షోను నిలిపివేయాలని పిటిషన్ దాఖలవడంతో షో నిర్వాహకులతోపాటు సెన్సార్ బోర్డుకు కోర్టు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, తదుపరి విచారణ వరకు షో కొనసాగించేందుకు అనుమతినిచ్చింది.
‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట తమిళ హీరో ఆర్య ఓ రియాల్టీ షో నిర్వహిస్తున్నాడు. ఆ షోలో 18 ఏళ్లు దాటిన యువతులు పాల్గొంటారు. ఆ షో విజేతను ఆర్య వివాహం చేసుకోబోతున్నాడు. నటి సంగీత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆ షో కలర్స్ తమిళ్ ఛానెల్ లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రసారం అవుతోంది. ఆ షో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, కంటెస్టెంట్ లను కించపరిచేలా ఆ షోలో టాస్క్ లు ఉంటున్నాయని జానకి అమ్మల్ అనే ఉద్యమకారిణి ఆరోపించారు. ఆ షోను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాసినా స్పందన రాలేదు. దీంతో, మద్రాస్ హైకోర్టులో జానకి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.... షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ఆ షోని ఎలా అనుమతించారో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 18కు వాయిదా వేసింది. అయితే, అప్పటివరకు షో ను నిలిపివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.