కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం ''సార్పట్ట పరంబరై''. 'కబాలి' 'కాలా' వంటి చిత్రాలు రూపొందించిన పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఇన్నాళ్లూ ఎదురు చూసిన మేకర్స్.. చివరకు ఓటీటీ విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో జూలై 22న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల చేయబడిన 'సర్పట్ట' తమిళ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.
'సార్పట్ట' సినిమా 1970స్ నాటి ఉత్తర మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ స్పోర్ట్స్ కథాంశంతో రూపొందింది. బ్రిటిష్ వారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు.. వాళ్ళ తమాషా కోసం బాక్సింగ్ ఆటను భారతీయులకు నేర్పించారని.. వెంకట్రామయ్య అనే వ్యక్తి మొట్ట మొదటిసారిగా తెల్లవాళ్ళని ఓడించారని ఈ ట్రైలర్ లో చెప్పారు. ఈ క్రమంలో బాక్సింగ్ వారసత్వం కోసం సర్పట్టా - ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య జరిగే కొట్లాటని చూపించారు. వేటపులి అనే ప్రత్యర్థి వర్గానికి చెందిన బాక్సర్ ని ఓడిస్తానని సవాలు చేసిన ఆర్య.. బాక్సర్ గా మారడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
బాక్సింగ్ లో ప్రత్యర్థిని ఓడిస్తానని ఛాలెంజ్ చేసిన ఆర్య.. బాక్సింగ్ ఆటకు ఎందుకు దూరం అయ్యాడు? మళ్ళీ ఎలా తిరిగి రింగ్ లో అడుగు పెట్టాడు? తన ఛాలెంజ్ నెగ్గాడా లేదా? అనేది తెలియాలంటే 'సార్పట్టా' సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో ఆర్య సరసన దుషారా విజయన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. పసుపతి - కలైరసన్ - జాన్ కొక్కెన్ - జాన్ విజయ్ - సంతోష్ ప్రతాప్ - పార్థిబాన్ రాధాకృష్ణన్ - భగవతి - సంజనా నటరాజన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందించారు. నీలం ప్రొడక్షన్స్ సమర్పణలో కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Full View