సౌఖ్యం సినిమా ఆడియో వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తాడని ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. ఐతే నిన్న రాత్రి ఒంగోలులో జరిగిన ఆడియో ఫంక్షన్ లో బాలయ్య లేడు కానీ.. ఆయన నినాదాలతో ఆ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ముఖ్యంగా బాలయ్య వీరాభిమాని, ఆయనతో ‘వీరభద్ర’ సినిమా కూడా తీసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ప్రసంగిస్తుండగా.. అభిమానులు జై బాలయ్య నినాదాలతో రచ్చ చేశారు. దీంతో ‘సౌఖ్యం’ గురించి కాకుండా రవికుమార్ ముందు బాలయ్య గురించే మాట్లాడాల్సి వచ్చింది. మైకు అందుకోగానే ‘జై బాలయ్య’ నినాదాలు హోరెత్తడంతో.. ‘‘జై బాలయ్య.. ఆ నినాదం మన ఆస్తి.. మొహమాటం ఏమీ లేదందులో. ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టని నినాదం అది. ఓకేనా’’ అంటూ బాలయ్య అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తాడు రవికుమార్ చౌదరి.
ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తూ.. ‘‘ఇక సౌఖ్యం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ ఊర్లల్లో ఉండేవారికి టీవీల్లో మాత్రమే ఆడియో ఫంక్షన్లు చూడ్డం అలవాటు. ఐతే గోపీచంద్ సొంత ఊళ్లో ఆడియో ఫంక్షన్ పెడదామని నిర్మాత చెప్పారు. ముందు కొంచెం కంగారు పడ్డాం. కానీ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒంగోలు ప్రజానీకానికి హ్యాట్సాఫ్. నేను పుట్టి పెరిగింది గుంటూరులో అయినా నాకు జీవనోపాధి కలిగించింది ఒంగోలే. నా కెరీర్ని మలుపు తిప్పిన యజ్నం సినిమా హీరో గోపీచంద్, నిర్మాత పోకూరి బాబూరావులది ఈ ఊరే. నేను కెరీర్లో రెండుసార్లు కింద పడి లేచాను. అప్పుడు నాకు అండగా నిలిచినవాళ్లందరికీ ధన్యవాదాలు. సౌఖ్యం సినిమాకు శ్రీధర్ సీపాన చాలా మంచి కథ అందించాడు. గోపీమోహన్, కోన వెంకట్ ఎంతగానో తోడ్పాటునందించారు. సౌఖ్యం సినిమాకు నమ్మకంతో రండి. సంతోషంగా వెళ్లండి. ఇది మా హామీ’’ అని చెప్పాడు చౌదరి.