చరణ్ చిత్రానికి సల్మాన్ సినిమాటోగ్రాఫర్

Update: 2016-02-23 04:04 GMT
రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ధృవ' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికి ఇదే వర్కింగ్ టైటిల్. ఫైనల్ టైటిల్ కాకపోయినా.. ఇదే టైటిల్ పై పని చేయనున్నారు. ప్రస్తుతానికి చెల్లి పెళ్లి కారణంగా చరణ్ షూటింగ్ లో పాల్గొనడం లేదు. కానీ విలన్ అరవింద్ స్వామి - నాజర్ సహా.. పలువురు నటులతో సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది.

తని ఒరువన్ రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో.. ఓ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. భజరంగీ భాయ్ జాన్ వంటి బ్లాక్ బస్టర్లకు పని చేసిన అసీం మిశ్రా.. ధృవకు ఛాయాగ్రహణం అందించనున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకుగాను.. అసీం మిశ్రాతో కలిసి దిగిన ఫోటోను.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేశాడు. ఈ మైండ్ గేమ్ బేస్డ్ మూవీలో కెమేరా పనితనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈ ప్రెస్టీజియస్ సినిమాటోగ్రాఫర్ ని పట్టుకొచ్చారు.

మార్చ్ 5నుంచి ధృవ షూటింగ్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానుండగా.. చెర్రీతో కలిసి మరోసారి రకుల్ ఆడి పాడనుంది. ఈ మూవీలో హీరోయిన్ కేరక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. అంతా హీరో-విలన్ ల మధ్యే స్టోరీ నడుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
Tags:    

Similar News