అషూ - రాహుల్ సిప్లింగ్.. నిజంగా ఫ్రెండ్షిప్పేనా?

Update: 2021-01-17 12:35 GMT

బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్లొచ్చిన తర్వాత దశ తిరిగిన వాళ్లలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒకరు. మూడో సీజన్‌ విజేతగా నిలిచిన ఆయనకు.. ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రంగమార్తాండ చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో సింగర్‌ కాస్త యాక్టర్‌ గా మారాడు. ఈ మధ్యే బిజినెస్‌మెన్‌గానూ అవతరించాడు రాహుల్.

తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ఫేమస్‌ అయిన రాహుల్‌.. ఇప్పుడు అదే యాస పేరుతో బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. "ఊకో కాకా" పేరుతో బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ మధ్యే కరీంనగర్‌లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే జోష్‌లో నేడు సాయంత్రం హైదరాబాద్‌లో కూడా స్టోర్‌ ఓపెన్ చేస్తున్నాడు రాహుల్.

ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అషూ రెడ్డి కూడా వచ్చేస్తోంది. ఈ విషయాన్ని రాహుల్‌ తన అభిమానులకు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. "నీ బలహీనతలు తెలిసినా కూడా.. బలాన్ని మెచ్చుకునేవాళ్లే నిజమైన స్నేహితులు. 'ఊకో కాకా' స్టోర్‌ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు స్వాగతం. మజాక్‌ కాదు, కాకా ఫ్రెండ్‌ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు రాహుల్.

అయితే.. అంతా బానే ఉంది కానీ ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. 'నిజంగా స్నేహితురాలైతే అలా ఎత్తుకుంటారా? మీది ఫ్రెండ్‌షిప్‌ అంటే ఒప్పుకోము, ఏదో తేడా కొడుతోంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది..' అంటూ కొందు పబ్లిక్‌గానే కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు రాహుల్ ను సపోర్టు చేస్తున్నారు. 'ఎహె.. ఫ్రెండ్‌ను ఎత్తుకోవడం కూడా తప్పేనా? దానికే ఏదో అయిపోయినట్లు తెగ ఫీల్‌ అవుతారేంది?' అంటున్నారు పలువురు రాహుల్ ఫ్యాన్స్. మరి, ఈ కామెంట్లలో ఏది నిజం అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.
Tags:    

Similar News