వరుస యాక్సిడెంట్లు టాలీవుడ్ కి ఊపిరి సలపనివ్వడం లేదు. వరుసగా ఐదారుగురు హీరోలు యాక్సిడెంట్లకు గురయ్యారు. అందులో ఓ టీవీ ఆర్టిస్టు కం కమెడియన్ కూడా ఉన్నారు. సరిగ్గా పదిరోజుల క్రితం వెంకీ మామ సెట్స్ లో విక్టరీ వెంకటేష్ కి యాక్సిడెంట్ అయ్యిందని వార్తలొచ్చాయి. వెంకీకి పెద్ద ప్రమాదం కాకపోయినా.. గోపిచంద్ - ఎన్టీఆర్- చరణ్- శౌర్య- శర్వానంద్- సందీప్ కిషన్ వీళ్లందరికీ అయినవి పెద్ద యాక్సిడెంట్లే. వీళ్లలో గోపిచంద్ నెలరోజుల పాటు సుదీర్ఘంగా రెస్ట్ తీసుకున్నారు. శర్వానంద్ రెండు మూడు వారాలు తప్పలేదు. చరణ్-ఎన్టీఆర్ సైతం వారం పైగానే విశ్రాంతి తీసుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ పెను ప్రమాదం నుంచి జస్ట్ మిస్సయ్యారు. జబర్థస్త్ నటుడు ఒకరు ఇలానే ప్రమాదం నుంచి బయటపడ్డారని వార్తలు వచ్చాయి.
అసలు మన హీరోల్ని ఈ యాక్సిడెంట్లు ఎందుకు వెంటాడుతున్నాయి? దాని వెనక ఇంకేదైనా కారణం ఉందా? పండిత పామరులు ఏమనుకుంటున్నారు? ప‌్రమాదాల వెనక అసలు కారణమేంటి? టాలీవుడ్ ఎలాంటి ఫేజ్ లో ఉంది? అంటూ విశాఖపట్నంకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష శాస్త్రజ్ఞుడు- వేదమాత శ్రీ గాయత్రి పీఠం (శ్రీ శిరిడి సాయి జ్యోతిష్యాలయం) పండితులు బి.సాయి శర్మ (ఎం.ఏ -ఎల్.ఎల్.బి-ఎం.ఏ జ్యోతిష్యం)ను ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన వివరణ ఇదీ..
గత వరుస సంఘటనల(యాక్సిడెంట్ల)కు కారణం మిధున రాశిలో రవికుజుల స్థానం కలిగి ఉండడం.. సంచారంలో శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది మిథునరాశి. ఆ రాశిలో రవితో కూడుకున్న కుజుడు కలయిక వల్ల అగ్నితత్వం వల్ల.. అగ్ని కారకుడు అవ్వడం వల్ల గతంలో యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు మారింది.. రవి కుజుడు సింహరాశిలోకి వెళ్లారు. అయితే ఇపుడు ప్రధానంగా యాక్సిడెంట్ల కారణం మిధునరాశి సంచారంలో అష్ఠమ శని ప్రవేశిస్తోంది. జనవరిలో ఇది ప్రవేశించాల్సి ఉన్నా.. ఆరు నెలల ముందే ప్రభావం చూపిస్తుంటుంది. తర్వాత తులారాశి వారికి కూడా ప్రారంభమవుతుంది. వీరికి శని మిత్రకారకం అవ్వడం వల్ల ప్రమాదం తక్కువ. ధనుస్ రాశి అయినా ఏలిన్నాటి శని ఉంది. ప్రమాదాలుంటాయి. ఎవరికైనా ఉధృతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే మూడు రాశులు చూడాలి. మిధున రాశి అయినా అయ్యుండాలి. లేదా మకర రాశి అయినా అయ్యి ఉండాలి.. కుంభ రాశికి శని ప్రవేశం జనవరిలో ప్రభావం ఉంటుంది. శని ప్రభావం వల్ల శుక్రుడికి యోగస్థానం అయిన రాశుల్లోనే శని సంచారం జరుగుతున్నప్పుడు కొంత వ్యతిరేక ప్రభావం ఉంటుంది. దీనివల్ల యాక్సిడెంట్లు తప్పవు. ముఖ్యంగా కళారంగం.. సినీరంగంలో స్టార్లు- కమెడియన్లపై దీని ప్రభావం ఉంటుంది... అని వివరణ ఇచ్చారు. కొన్ని రాశుల వాళ్లకు ఇలాంటివి తప్పవు. ముహూర్తం .. వర్జ్యం.. కుజదోషం అంటూ నమ్మకం ఎక్కువగా ఉండేది స్టార్లకు సినిమా వాళ్లకే. అందుకే ఈ ప్రత్యేక ఆర్టికల్ ని తుపాకి ఎక్స్ క్లూజివ్ గా వారికి అంకితమిస్తోంది.