ఒక గమ్మత్తైన విషయాన్ని చెప్పుకొచ్చారు హీరో సూర్య. అటు తమిళం.. ఇటు తెలుగులో తనదైన శైలిలో దూసుకెళ్లే అతగాడు హీరోగా రాజ్యమేలతాడన్న విషయాన్ని అతని చిన్నతనంలోనే తేల్చేశారట. నమ్మశక్యంగా లేని ఈ విషయాన్ని సూర్య తాజాగా వెల్లడించారు.
తన చిన్నప్పుడు ఒక గొప్పజ్యోతిష్యుడు తమ ఇంటికి వచ్చాడని.. తన తండ్రితో మాట్లాడే సందర్భంగా మీ అబ్బాయి హీరో అవుతాడని చెప్పినట్లుగా వెల్లడించారు. జ్యోతిష్యుడు హీరో అవుతాడని చెబితే.. అందుకు తన తండ్రి.. ‘కార్తీ’నా? అని అడిగితే.. లేదు సూర్య అని చెప్పాడని.. ‘సూర్యా’ నా అని ఆయన చిరాకు పడినట్లు చెప్పుకొచ్చాడు.
జ్యోతిష్యుడి మాటల్ని విని అంత అపనమ్మకంగా అడగటానికి ఒక కారణం ఉందన్న సూర్య.. ‘‘అప్పట్లో నేను అంత చురుగ్గా ఉండేవాడిని కాదు. అందుకే ఆయనకు నా మీద నమ్మకం ఉండేది కాదు. జ్యోతిష్యుడు చెప్పినట్లే ముందు నేను హీరోను అయ్యాను. తర్వాత కార్తీ ఆయ్యాడు. ఇక మా ఇద్దరిలో ఎవరు చురుకు అంటే.. తమ్ముడే. చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. మొహమాటం.. బిడియం ఎక్కువ. చదువులోనూ అంతంత మాత్రమే. కార్తీ మాత్రం ఫాస్ట్.. చదువులోనూ ఫస్ట్. ఇంట్లోనే కాదు.. బయట కూడా నేను సైలెంట్ గా ఉండేవాడ్ని’’ అంటూ తన గురించి చెప్పుకొచ్చారు. వెండితెర మీద డైలాగులతో చెలరేగిపోయే హీరో సూర్య.. మరీ అంత సైలెంటా?